రేఖ తండ్రి జెమినీ గణేషన్ తమిళనాడులో పేరు ఉన్న నటుడు. ఆయన జీవితంలో విచ్చలవిడిగా తిరిగాడు. సావిత్రిని కూడా అలాగే ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఆమె ఆస్తులని కొట్టేశాడు. సావిత్రిని పెళ్లి చేసుకునే సమయానికి అంతకు ముందు ఉన్న భార్యకి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయినా గాని సావిత్రిని పెళ్లి చేసుకున్నాడు. ఆ మహానటి అలా నాశనం అయిపోయింది. సావిత్రికి పుట్టిన ఒక మహిళ ఇప్పటికీ తన తల్లి ఎడల గౌరవంగా ఉంటూ ఆమె జన్మదినం చేసుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు కనపడుతుంది .తన తల్లికి జరిగిన అన్యాయం తెలుసుకుని బాధపడుతుంది.
అలాగే రేఖ కూడా అంతకుముందు ఒక భార్యకు పుట్టింది. జెమినీ గణేషన్ మొదటి కూతురు ఈ రేఖ. బాలీవుడ్ లో మంచి నటి గా పేరు తెచ్చుకుంది. తన తండ్రి చేసిన చెత్త పని చూసి అసహ్యించుకుని తాను ఇంకెవరు మొగోడి జీవితంలోకి వెళ్ళకూడదు పెళ్ళంటూ చేసుకోకూడదు పిల్లల్ని కని అలా గాలికి వదిలేయకూడదు వాళ్ళ జీవితాలు నాశనం చేయకూడదు అని ఒక మహిళగా గట్టిగా నిశ్చయమైన నిర్ణయం తీసుకొని పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది.
తిరుగుబోతు తండ్రిని కళ్ళారా చూసి ముగ్గురు భార్యలు ఆరుగురు ఏడుగురు పిల్లలు ఆస్తులు నాశనం తాగుబోతు ఇలాంటి మగవాడి తోటి ఆ తల్లులు పడ్డ బాధ కళ్ళారా చూసింది అందుకే విరక్తి చెంది మగవాడిని ఎవర్ని పెళ్లి చేసుకోలేదు అలాగే ఉండిపోయింది.