ప్రభాస్ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు… అయన పేరు చెపితే చాలు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారు.. ఇప్పటికే రాజా సాబ్ సినిమా నుంచి ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది.. ఇన్నాళ్లు గ్రే సినిమాల్లో నటించిన ప్రభాస్ ఇప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ అండ్ లవబుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నట్టు ఆ ఫొటోలో కనిపిస్తుంది… ఇక ఆయన సినిమాల అప్డేట్లు… సినిమాల కథలు పక్కన పెడితే బాహుబలి ప్రభాస్ కు 45ఏళ్ళు వచ్చేసాయి.. అయినా ఇప్పటికీ పెళ్లి కాలేదు.. దీంతో అభిమానులు పెళ్లి ఎప్పుడు ప్రభాస్ అని ప్రశ్నలు వెయ్యడం మొదలెట్టారు…
అలా అభిమానులు ప్రశ్నలు వెయ్యడంతో ఓ కథ బయటకొచ్చింది.. అదేంటంటే ప్రభాస్ ను ప్రేమించి 40 ఏళ్ళు అయినా పెళ్లి చేసుకోకుండా ఉన్న హీరోయిన్స్ గురించి…ఆ హీరోయిన్స్ ఇద్దరు బ్యాక్ టూ బ్యాక్ ప్రభాస్ సినిమాల్లో హీరోయిన్స్ గా నటించారు… వాళ్ళ ఇద్దరితో నటించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. ఆ హీరోయిన్స్ మరెవరో కాదు… అనుష్క, త్రిష. ప్రభాస్ త్రిషతో పౌర్ణమి, వర్షం, బుజ్జిగాడులో నటిస్తే.. అనుష్కతో బిల్లా, మిర్చీ, బాహుబలి, బాహుబలి 2 సినిమాల్లో నటించారు.
నిజానికి ప్రభాస్ త్రిష కలిసి సినిమాల్లో నటించేప్పుడు ఫ్యాన్స్ అంత కూడా వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది.. క్యూట్ ఉంటారంటూ అప్పట్లో ఓ రేంజ్ లో ప్రోత్సహించారు… కానీ ప్రభాస్ కానీ త్రిష కానీ ఎప్పుడు కూడా లవ్ స్టోరీ గురించి చెప్పలేదు.. నిజానికి త్రిషతో ప్రభాస్ ప్రేమాయణం అని అప్పట్లో వార్తలు వచ్చాయి.. కానీ అందులో నిజం లేదు. . అలానే త్రిష కూడా ప్రభాస్ ప్రేమ కోసమే పెళ్లి చేసుకోలేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించినప్పటికి అందులో ఎంత నిజం ఉందొ తెలియదు. ఆతర్వాత అనుష్కతో కలిసి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసినప్పుడు ఫ్యాన్స్ అలానే స్పందించారు… ప్రభాస్ లో ప్ర అనుష్కలో నుష్క తీసుకొని ప్రనుష్క అని కూడా పేరు పెట్టేసుకున్నారు…
ఇక అనుష్కతో అయితే ప్రభాస్ ప్రేమించినట్టు ఇంట్లోవాళ్ళు ఒప్పుకోలేదని అందుకే పెళ్లి చేసుకోలేదని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. . కానీ అది కూడా క్లారిటీ లేదు.. ఇక అలానే ప్రభాస్ కూడా తన పెళ్లి గురించి ఇప్పటికి ఏం చెప్పలేదు.. అనుష్క కూడా సినిమాల్లోను నటించట్లేదు అటు పెళ్లి చేసుకోలేదు. అసలు ప్రభాస్ కోసమే ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారంటూ మరోవైపు వార్తలు వినిపిస్తున్నాయి.