నిమ్మకాయల్లో ఎంతటి ఆరోగ్యకర ప్రయోజనాలు దాగి ఉన్నాయో అందరికీ తెలిసిందే. సిట్రస్ జాతికి చెందిన ఈ పండులో విటమిన్ సి, బి1, బి2, బి3, బి5, బి6, బి9, కోలిన్, డైటరీ ఫైబర్, కాల్షియం, మెగ్నిషియం, పాస్ఫరస్, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. నిమ్మరసాన్ని మనం ఎన్నో రకాల స్వల్ప అనారోగ్యాలకు ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు. అయితే ఎవరైనా నిమ్మకాయను లేదా దాని రసాన్ని పచ్చిగానే వాడుతారు. లేదంటే పచ్చడి పెట్టుకుని, వివిధ వంటకాల్లోనూ దాన్ని ఉపయోగిస్తారు. కానీ మీకు తెలుసా? ఘనీభవించిన (Frozen) నిమ్మకాయతో కూడా మనకు చాలానే ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయని. అవును, ఇది నిజమే.
నిమ్మకాయలను డీప్ ఫ్రిజ్‌లో గడ్డ కట్టేంత వరకు ఉంచాలి. అనంతరం వాటిని తీసి మిక్సీతో పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని మనం నిత్యం ఉపయోగిస్తే చాలు దాంతో సాధారణ రసం వాడినట్టుగానే ఎన్నో రకాల ప్రయోజనాలు మనకు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా నిమ్మకాయలో ఎవరైనా పొట్టును ఎక్కువగా ఉపయోగించరు. కానీ దాంట్లోనూ నిమ్మరసంలో ఉన్నన్ని పోషకాలు ఉంటాయి. కాబట్టి ఆ పోషకాలను కూడా పొందాలంటే నిమ్మకాయలను Frozen రూపంలో తీసుకుంటే సరి. దీంతో సాధారణ నిమ్మరసంతో మనకు కలిగే ఉపయోగాలకు డబుల్ ఉపయోగాలు కలుగుతాయి.
Frozen నిమ్మను వాడడం వల్ల శరీరంలో ఉన్న విష పదార్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. ఇంతకు ముందు కన్నా శరీరం ఎంతో ఉత్తేజంగా ఉంటుంది. పలు రకాల క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో Frozen నిమ్మ పనికొస్తుంది. ఇది క్యాన్సర్ కణాలను ఎదగనీయకుండా చేస్తుంది. శరీరంలో ఏర్పడే గడ్డలు, ట్యూమర్లను కరిగిస్తుంది. క్యాన్సర్‌కు ఉపయోగించే కిమో థెరపీ కన్నా ఈ Frozen నిమ్మ దాదాపు 10వేల రెట్ల ఎక్కువ శక్తిని కలిగి ఉంటుందట. అందుకే ఇది క్యాన్సర్‌లకు విరుగుడుగా పనిచేస్తుంది.
బ్రెస్ట్, కోలన్, ప్రోస్టేట్, లంగ్స్, పాంక్రియాస్ వంటి క్యాన్సర్‌లను అడ్డుకునే శక్తి ఈ నిమ్మకు ఉంది. యాంటీ మైక్రోబియల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు దీంట్లో పుష్కలంగా ఉంటాయి. అవన్నీ మన శరీరంలో చేరే వివిధ రకాల క్రిములు, పురుగులు, సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి. బీపీని తగ్గిస్తాయి. డిప్రెషన్, ఒత్తిడి, ఇతర మెదడు సంబంధ అనారోగ్యాల నుంచి రక్షణ లభిస్తుంది. విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. గాల్‌స్టోన్స్, కిడ్నీ స్టోన్స్‌ను కరిగిస్తుంది.