Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

నా జీతం 7కోట్లు.. ఏం చేసుకోను.. నా భార్య విడాకులు అడుగుతోంది!.. ఐటీ ఉద్యోగి ఆవేదన..!

Admin by Admin
February 16, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మీరు చెప్పినట్లేగానే నేను వారానికి 70గంటలకు పైగా పనిచేశా. చివరికి నాకు మిగిలిందేంటి? నా భార్య విడాకులు ఇవ్వమని అంటోంది. ఇప్పుడేం ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ ఓ టెక్కీ సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల, ప్రపంచ దేశాలతో పోటీపడాలంటే భారత్‌లోని యువత వారానికి 70గంటల పాటు పనిచేయాలని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సూచించారు. అయితే, నారాయణ మూర్తికి సూచనకు పలువురు మద్దతు పలికితే.. మరికొందరు విమర్శించారు. ప్రముఖ సంస్థ లార్సన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) చైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ మరో అడుగు ముందుకేసి వారానికి 90 గంటలు పనిచేయండి. ఎంత కాలం భార్యలను చూస్తూ కూర్చుంటారు? అని ప్రశ్నించారు. అలా మీరు చెప్పినట్లు చేస్తే అందరికి నాకు పట్టిన గతే పడుతోంది. మీరు చెప్పినట్లుగా చేసినందుకే నా భార్య నన్ను విడాకులు కోరుతోంది’అని ఓ టెక్కీ పరోక్షంగా సోషల్‌ మీడియా వేదికగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు.

ప్రస్తుతం, ఈ ఘటన సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీసింది. ప్రముఖలు చెప్పినట్లుగా పనిచేస్తే తమ భవిష్యత్‌ ఇలాగే ఉంటుందేమోనంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పేరు ప్రస్తావించని టెక్కీ.. అధిక పనిగంటల కారణంగా తన జీవితంలో ఎదురైన సంఘటనను ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ బ్లిండ్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు. ఆ పోస్టులో ‘నేను ఐటీ రంగంలో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని కలలు కన్నా. కలల్ని సాకారం చేసుకునే ప్రయత్నంలో మూడేళ్లలు అహర్నిశలు కష్టపడి పనిచేశా. ప్రమోషన్‌ కోసం జూనియర్‌ నుంచి సీనియర్‌ స్థాయికి చేరుకున్నాను. జీతం, ప్రమోషన్‌ పెరిగే కొద్ది పనికూడా పెరిగింది. ఎంతలా అంటే నా విధుల్లో భాగంగా యురోపియన్‌ యూనియన్‌ దేశాలతో పాటు ఆసియా దేశాల ఉద్యోగుల్ని సమన్వయం చేసుకోవాల్సి వచ్చేంది. ఫలితంగా, ఆఫీస్‌ మీటింగ్స్‌ సైతం ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటలకు ముగిసేవి. అది చాలదన్నట్లు కొన్ని సార్లు రోజుకు 14 గంటలు కంప్యూటర్‌తో కుస్తీ పడేవాడిని. ఆ కష్టానికి ప్రతిఫలం దక్కింది. మూడేళ్లకే సీనియర్‌ మేనేజర్‌గా ప్రమోషన్‌తో పాటు ఏడాదికి రూ.7.8 కోట్ల జీతం కూడా తీసుకున్నాను.

it employee sad story

కానీ ఏం లాభం ఇప్పుడు నా భార్య నాకు విడాకులు కావాలని అడుగుతోంది. అందుకు కారణం నేనే. ఆఫీస్‌ వర్క్‌ కారణంగా నా భార్య డెలివరీ సమయంలో అందుబాటులో లేకపోయాను. డెలివరీ తర్వాత తనతో గడిపానా అంటే అదీలేదు. తోడు లేక, నా కూతురు పుట్టిన రోజులకు అటెండ్‌ కాలేకపోయాను. పాపం నా భార్య డిప్రెషన్‌కు గురైంది. డిప్రెషన్‌ ఎక్కువైంది. డాక్టర్‌కు చూపించుకోవాలని అడిగేది. అది సాధ్యమయ్యేది కాదు. చివరికి ఈ బాధల్ని తట్టుకోలేక నా భార్య విడాకులు ఇవ్వమని అడిగింది. ఇప్పుడు నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

“నా జీవితంలో నేను ఏమి చేస్తున్నానో, ఏ కోల్పోయానోనని నన్ను నేను ప్రశ్నించుకోకుండా ఉండలేకపోతున్నాను. కానీ ఈ లేఆఫ్ తుఫాన్ యుగంలో నా దగ్గర ఉన్నదానితో నేను సంతోషంగా ఉండాలి కదా? కానీ సంతోషంగా ఎలా ఉండాలి?’ అని ప్రశ్నిస్తూ తన పోస్ట్‌కు ముగింపు పలికాడు.

Tags: it employee
Previous Post

సైన్స్ ప్రకారం భూమిపై అత్యంత అందమైన మహిళ ఎవరు?

Next Post

న‌లుగురు భార్య‌లు ఉన్న వ్య‌క్తి చ‌నిపోతూ.. త‌న‌తో తోడు ర‌మ్మ‌ని అడిగాడు..!

Related Posts

vastu

శంఖం ఇంట్లో ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..?

July 14, 2025
ఆధ్యాత్మికం

దేవుడి ప్ర‌సాదాన్ని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ పెట్ట‌కండి.. నిర్ల‌క్ష్యం చేయ‌కండి.. ఎందుకంటే..?

July 14, 2025
వినోదం

బాహుబ‌లి పాత్ర కోసం…ప్ర‌భాస్…తీసుకున్న బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్న‌ర్..లిస్ట్ ఇదిగో ఇంత‌లా ఉంది!?

July 14, 2025
technology

నాణ్య‌మైన ఫొటోలు, వీడియోలు కావాలంటే స్మార్ట్‌ఫోన్ కెమెరాలో ఇది ఉండాలి..!

July 14, 2025
technology

USB Type-C అంటే ఏమిటో… దాని వ‌ల్ల మ‌న‌కు ఉపయోగాలేంటో తెలుసా..?

July 14, 2025
హెల్త్ టిప్స్

షుగ‌ర్ వ్యాధి ఉన్న‌వారు దూర ప్ర‌యాణం చేయ‌కూడదా..?

July 14, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.