Yawning : సాధారణంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఆవలింతలు వస్తాయి. కొందరు ఆవలింతలను ఎక్కువగా తీస్తుంటారు. ఆ సమయంలో కొందరు ఒళ్లు విరుస్తారు కూడా. ఇక కొందరు అయితే అదే పనిగా ఆవలింతలు తీస్తుంటారు. కొందరికి ఆవలింతలు తక్కువగా వస్తాయి. కొందరు సీరియస్‌గా పనిచేస్తున్న సమయంలో, చదువుతున్నప్పుడు.. ఆవలింతలు వస్తుంటాయి. అయితే అసలు ఆవలింతలు ఎందుకు వస్తాయి ? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి ? అంటే..
ఆవలింతలు అనేవి వాస్తవానికి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ప్రారంభమవుతాయి. అప్పుడు మొదలైన ఆవలింతలు చనిపోయే వరకు వస్తూనే ఉంటాయి. కానీ ఆగవు. ఆవలింతలు రావడానికి ముఖ్య కారణం ఆక్సిజన్ అందకపోవడమే. శరీరానికి లేదా మెదడుకి ఆక్సిజన్ తగినంత లభించకపోతే అప్పుడు ఆవలింతలు వస్తాయి. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సాధారణంగా కొందరు రాత్రి పూట తక్కువగా నిద్రిస్తారు. దీంతో వారి శరీరానికి తగినంత ఆక్సిజన్ లభించదు. ఈ క్రమంలో మరుసటి రోజు వారికి ఉదయం నిద్ర లేచినప్పటి నుంచే బాగా ఆవలింతలు వస్తాయి. అలాగే కొందరు అతిగా నిద్రిస్తారు. దీని వల్ల కూడా ఆవలింతలు ఎక్కువగానే వస్తాయి.
మెదడుతో బాగా పనిచేసినప్పుడు కూడా ఆవలింతలు వస్తాయి. మెదడుకు ఆక్సిజన్ ఎక్కువ కావల్సి వస్తుంది. దీంతో ఆవలింత అనే సిగ్నల్ వస్తుంది. అయితే ఆవలింతలు ఎక్కువ, తక్కువ రావడం అనేది సహజమే. కానీ నిద్ర తక్కువ, ఎక్కువ అవడం వల్ల ఆవలింతలు వస్తే నిద్ర సరిగ్గా పోవాలి. లేదంటే ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఇక ఆవలింత తరువాత మెదడు చురుగ్గా పనిచేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఒక మనిషి తన జీవిత కాలంలో సుమారుగా 400 గంటల పాటు ఆవలిస్తాడని చెబుతున్నారు. అంటే సుమారుగా 2.40 లక్షల సార్లు ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఆవలిస్తాడన్నమాట. ఇక జంతువులకు కూడా ఆవలింతలు వస్తుంటాయి.