Milk : పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా వైద్య నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే మన శరీరానికి అవసరం అయ్యే దాదాపు అన్ని పోషకాలు పాలలో ఉంటాయి. అందువల్ల రోజూ పాలను తాగాలని సూచిస్తుంటారు. అయితే బరువు తగ్గాలని చూస్తున్న వారు పాలను తాగాలా.. వద్దా.. అని సందేహిస్తుంటారు. పాలను తాగితే బరువు పెరుగుతామేమోనని అనుకుంటుంటారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొవ్వు తీసిన పాలను ఎవరైనా సరే నిర్భయంగా తాగవచ్చు. దీంతో బరువు పెరగరు, బరువు తగ్గుతారు. అందువల్ల కొవ్వు తీసిన పాలను రోజూ తాగితే బరువును తగ్గించుకోవచ్చు. వాటిని తాగితే బరువు పెరుగుతామేమోనని సందేహించాల్సిన పనిలేదు.
ఒక గ్లాస్ కొవ్వు తీసిన పాలలో 8 గ్రాముల మేర ప్రోటీన్లు, 125 మిల్లీగ్రాముల మేర కాల్షియం ఉంటాయి. దీంతోపాటు విటమిన్ బి12, డి కూడా ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు సహాయ పడే పోషకాలు. అందువల్ల కొవ్వు తీసిన పాలను తాగడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు.
అయితే బరువు తగ్గాలని నియమం లేని వారు, ఆరోగ్యవంతులు, చిన్నారులు.. కొవ్వు తీయకుండానే పాలను తాగవచ్చు. దాంతో వారికి కావల్సిన పోషణ లభిస్తుంది. కానీ బరువు పెరగరు. అయితే బరువు తగ్గాలని చూసేవారు కొవ్వు తీసిన పాలను తాగితే శ్రేయస్కరం. ఈ విధంగాను పాలను తాగుతూ బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.