కొత్తగా పెళ్లైన దంపతులు…. ఇప్పుడప్పుడే పేరెంట్స్ అవ్వడానికి ఇష్టపడరు. అలాగనీ… తమ మధ్య శృంగారాన్ని ఆపుకోలేరు. ఇలాంటి సమయంలో వారికి దిక్కు కండోమ్సే. గర్భం రాకుండా శృంగారాన్ని అనుభవించగలిగేలా చేసేవి కండోమ్సే. అయితే కేవలం తొడుగుల వల్లే కాకుండా మరికొన్ని పద్దతుల ద్వారా కూడా గర్భం రాకుండా నిరోధించవచ్చు. అవేంటో ఓ సారి చూద్దాం.( దంపతులకు మాత్రమే……)
ఈ సమయంలో రతిక్రీడ వద్దు: సాధారణంగా స్త్రీ బుుతుచక్రం మీద గర్భం ఆధారపడి ఉంటుంది. అంటే 1 వ తేదీ స్త్రీ బహిష్టు అయితే….. ఆమెలో 12 వ తేదీ నుండి 16 వ తేదీ లోపు అండం విడుదల అవుతుంది. ఈ సమయంలో స్త్రీ పురుషుల మధ్య కలయిక జరిగితే గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ సమయంలో భార్యాభర్తలు కలయికకు దూరంగా ఉండాలి.
అంతేకాకుండా…స్త్రీల అండాలకు 2-3 రోజులు సజీవం గా ఉంటే గుణం ఉంటుంది, పురుషుల శుక్రకణాలకు 1 రోజు సజీవంగా ఉండే లక్షణం ఉంటుంది. దీనిని బట్టి… 20 వ తేదీ లోపు కలయిక కు దూరంగా ఉంటే గర్భం రానట్టే…అంటే 1 వ తేదీన బుుతుచక్రం స్టార్ట్ అయితే…. 12 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు కలవక పోతే గర్భం వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. వీర్య స్కలన సమయంలో అంగాన్ని యోని నుండి తీసేయడం. ( ఇది కష్టతరం)
పిల్స్ వాడడం ( ఇది ఆరోగ్య రిత్యా అంత శ్రేయస్కరం కాదు). కాపర్ T : అభివృద్ది చెందిన పలుదేశాల్లో దీని వినియోగం ఎక్కువైంది. నిపుణుడైన డాక్టర్ సహాయంతో దీనిని స్త్రీలో ఏర్పాటు చేస్తారు. పిల్లలు కావాలనుకున్నప్పుడు కాపర్ T ని తొలగిస్తారు. ఆపరేషన్: ఇక భవిష్యత్ లో కూడా పిల్లలు వద్దు అనుకున్నవారికి బెస్ట్ సొల్యుషన్.