ఆధునిక యువతీ యువకులు అంగాంగాలను ప్రదర్శించేందుకు బిగువైన స్కిన్ టైట్ దుస్తులు వేస్తున్నారు. ఈరకమైన దుస్తులు ధరించటం ఎపుడో ఒకసారైతే పరవాలేదు కాని ఎప్పుడూ అదే విధంగా దుస్తులు వేస్తే దాని ప్రభావం ఆరోగ్యంపై వుండగలదంటున్నారు నిపుణులు. గాలి ఆడదు….అసౌకర్యం! అయినా వేయాల్సిందే. సమస్యలు ఏమేమి వస్తాయో చూద్దాం టింగ్లింగ్ తై సిండ్రోమ్: దీనిని మెడికల్ భాషలో మెరాల్జియా పరేస్తేటికా అంటారు. టైట్ పేంట్లు, జీన్లు వేస్తే తొడజాయింట్లు తేమగాను చుర చురమంటూ వుంటాయి. దీనిని నివారించాలంటే, స్కిన్ టైట్ డెనిమ్ పేంట్లను తరచుగా వేయటం మానాలి. శరీరానికి తగిన గాలిచొరబడే పేంట్లను వాడాలి.
వెన్ను నొప్పి: టైట్ గాను నడుము కిందకు వేసే జీన్స్ పేంట్లు వెనుక కండరాలను అదిమిపెట్టి నొప్పినిస్తాయి. దీనికి నివారణ కూర్చునేటపుడు మీ శరీరం ఏ మాత్రం కుదించకుండా వుండాలి. గిడ్డినెస్ – టైట్ డ్రెస్ లు తరచుగా ధరిస్తూ వుంటే శ్వాస సమస్యలు, చెమట పట్టడం, తెలివి కోల్పోయి మూర్ఛిల్లటం జరుగుతుంది. ఆరోగ్యం కోల్పోయేకంటే దాని కొరకు కనీసం కొంచెం వదులైన దుస్తులు ధరించటం మంచిది. దీనివలన అసౌకర్యం, తలనొప్పి, చూపు మందగించటం జరుగుతుంది. దీనిని నివారించాలంటే మెడ బిగువున్న టీ షర్టులు వదిలేయడమే.
గుండెలో మంటా? కడుపులో నొప్పా? పొట్టపై ఒత్తిడి వుంటే అది నొప్పికి దోవతీస్తుంది. యాసిడ్ బయటకు వచ్చి మంట కూడా ఏర్పడుతుంది. వేసే టైట్ పేంట్ జీర్ణక్రియకు హాని చేస్తుంది. దీని కారణంగా నోటిలో చేదు, పొత్తి కడుపు భాగంలో నొప్పి వస్తాయి. దీనిని నివారించాలంటే పేంటు బటన్ లు ఊడదీయండి. పేంటును తక్షణమే మార్చెయ్యండి. మంచినీరు తాగండి. వదులైన దుస్తులు వేయండి. బిగువైన దుస్తులు ఫ్యాషన్ కొరకు ధరించే యువతీ యువకులు వారికి అవసరమైంది ఆరోగ్యమా? లేక దానిని కోల్పోయి దుస్తుల కారణంగా అందంగా వుండటమా? అనేది నిర్ణయించుకోవాలి.