రన్నింగ్, జాగింగ్, వాకింగ్, ఆటలు ఆడడం… వీటన్నింటిలో ఏది చేసినా మనకు మంచి ఆరోగ్యం చేకూరుతుంది. అయితే వీటిలో దేన్ని ఆచరించాలన్నా ప్రతి ఒక్కరు స్పోర్ట్స్ షూ మాత్రం ధరించాల్సిందే. లేదంటే అసౌకర్యంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అనుకోని ఇబ్బందులు, ప్రమాదాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే ఏ కంపెనీకి చెందిన స్పోర్ట్స్ షూలో అయినా లేసులు కట్టుకునే దగ్గర రెండు అదనపు రంధ్రాలు ఉంటాయి. వాటిని మీరు ఎప్పుడైనా గమనించారా? లేదా? అయితే ఇప్పుడు గమనించండి.
ఇంతకూ ఆ అదనపు రంధ్రాలు ఎందుకు ఉన్నాయనేగా మీ సందేహం. ఇంకెందుకూ గాలి కోసం అంటారా? అయితే మీరు పొరపాటు పడినట్టే! మరెందుకూ, డిజైన్‌లోనే అలా లోపంతో వచ్చాయంటారా? ఇప్పుడు కూడా మీరు పొరపాటు పడ్డారు. ఈ రెండు కారణాలైతే అసలే కాదు. మరెందుకు అలా రంధ్రాలు ఉన్నాయి? అంటారా! వాటి గురించే ఇప్పుడు మేం చెప్పబోయేది.
ఏ కంపెనీకి చెందిన స్పోర్ట్స్ షూకైనా లేసులు కట్టుకునే వద్ద రెండు అదనపు రంధ్రాలు కచ్చితంగా ఉంటాయి. అలా లేవంటే అవి స్పోర్ట్స్ షూ కావని అర్థం చేసుకోవాలి. అయితే ఆ రంధ్రాలు ఎందుకు ఉంటాయంటే వ్యాయామం చేసినా, ఆటలు ఆడినా కాళ్లతో రన్నింగ్ చేయడం, వాకింగ్ చేయడం ఎక్కువగా ఉంటుంది కనుక అలా చేసే వారికి మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు గాను ఆ రెండు అదనపు రంధ్రాలను ఇస్తారు. వాటి వల్ల లేసును మరో స్టెప్ అదనంగా కట్టుకోవచ్చు. దీంతో ఆ షూస్‌తో నడిచే వారికి మరింత సౌలభ్యంగా ఉంటుంది. అంతేకాదు లేసులు, షూస్ కాలి మడిమలను మరింత గట్టిగా పట్టుకుని ఉంటాయి. దీని వల్ల రన్నింగ్ చేసే వారు అంత ఈజీగా పడిపోకుండా ఉంటారు. ఇప్పుడు తెలిసిందా, స్పోర్ట్స్ షూస్‌కు లేసుల వద్ద అదనపు రంధ్రాలు ఎందుకు ఉంటాయో!