దంపతులే కాదు, ప్రేమికులు కూడా తరచూ లిప్ టు లిప్ కిస్ పెట్టుకుంటారు. అయితే ముద్దు ఇచ్చే క్రమంలో ఘాటైన ఎంగిలి లేదా లాలాజలం అటునుండి ఇటుకి, ఇటునుండి అటుకి ప్రవహిస్తుంది. కానీ వాస్తవంగా చెప్పాలంటే లిప్ టు లిప్ కిస్ మంచిది కాదట. దీంతో పలు అంటు వ్యాధులు వచ్చే చాన్స్ ఉంటుందట. దగ్గు, జలుబు, ఫ్లూ, హెచ్1ఎన్1 ఫ్లూ లాంటి అంటు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లిప్ టు లిప్ కిస్ వల్ల అవి మరింత ఊపందుకుంటాయి. ముద్దు సాధారాణ జలుబులనే కాదట ప్రోత్సహించేది మరో రకమైన మోనో న్యూక్లెసిస్ అనే వ్యాధిని కూడా ప్రోత్సహిస్తుందంటున్నారు వైద్య నిపుణులు.
నోటిలోని లాలా జలం నుండి ఎప్ స్టీన్ బార్ అనే వైరస్ తగిలితే చాలు వేగంగా విస్తరిస్తుందట. దగ్గరగా వుండి దగ్గినా, తుమ్మినా దీని బారిన అవతలివారు పడినట్లే. హెర్పెస్ కూడా వచ్చేస్తుందంటారు. గొంతు మంట, చిగుళ్ళ వ్యాధులు వంటివి కూడా సాధారణంగా అంటుకునేవే. మారుతున్న వాతావరణం బాక్టీరియాకి చాలా అనుకూలం. వేగంగా ఒకరినుండి మరి ఒకరికి వ్యాపిస్తుంది. అసలే ఇది రోగాల సీజన్. ఇక బాక్టీరియా వ్యాప్తికి ఇంతకంటే మరేం కావాలి. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు వైద్య నిపుణులు.
లిప్ టు లిప్ కిస్ పెట్టుకునే వారు కచ్చితంగా పైన తెలిపిన విషయాలను గుర్తుంచుకోవాలి. లేదంటే అంటు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకు గాను తాజా పండ్లు, అరటిపండు, ఆపిల్, బొప్పాయి వంటివి తినండి. దీంతో ముద్దు పెట్టుకున్నా ఢోకా ఉండదు.