వివిధ రకాల వ్యాయామాలు చేసి వేగంగా కొవ్వు కరిగిస్తూ పొట్టను తగ్గించుకోవచ్చు. మీరు ఏ రకమైన వ్యాయామాలు చేస్తే శరీరం వాటికి అలవాటు పడిపోతుంది. శరీరాన్ని వీలైనంతవరకు కదిలిస్తూ వుండాలి లేదంటే సౌకర్యంగా కూర్చుని పెరిగిపోతూ వుంటుంది. కనుక పొట్టకు అవసరమైన కొన్ని వ్యాయామాలు ప్రతిదినం ఆచరిస్తూ పెరగకుండా దానిని అదుపులో వుంచాలి. అందు కొరకు కొన్ని చిన్నపాటి వ్యాయామాలిస్తున్నాం. పరిశీలించండి. 1. బేసిక్స్: ప్రధానంగా శరీరాన్ని ముందుకు లేదా వెనుకకు వంచే వ్యాయామాలుంటాయి.
ముందుకు వంగేవి శరీర పైభాగానికి ఉపయోగపడితే, వెనక్కు వంగే వ్యాయామాలు శరీర దిగువ భాగానికి ఉపయోగపడతాయి. 2. నేలపై పరుండండి. చేతులు తలకింద లేదా ఛాతీ మీద పెట్టండి. కాళ్ళను నిలకడగా వుంచి ఛాతీతో పైకి లేవండి. రెండోదిగా, శరీర భాగాన్ని నిలకడగా వుంచి నడుము వరకు కాళ్ళను వర్టికల్ గా పైకి లేపండి. మొదట్లో సపోర్టు తీసుకున్నప్పటికి తర్వాతి దశలో ఏ రకమైన సపోర్టు లేకుండా ఈ వ్యాయామం చేయాలి.
3. నేలపై పరుండి ఒక పక్కకు తిరగండి. కాలు, చేయి పైకి లేపండి. రెండవ పక్కకు తిరగండి. ఈ సారి రెండవవైపున్న కాలు చేయి పైకి లేపండి. 4. గోడకు ఆనుకుని నిలబడండి. భుజాలు, పిరుదులు ఒకే లైనులో వుండాలి. ఒక చేయి పైకి ఎత్తండి. దానికి ఆపోజిట్ లో వున్న కాలు పైకి లేపండి. లేపిన కాలి వేళ్ళను మీ చేతి వేళ్ళతో పట్టుకోవాలి. ఇది కొంచెం కష్టమే అయినప్పటికి సాధనపై చేయగలరు. 5. సైకిలు తొక్కుడు – వెల్లకిలా పరుండండి. నడుము భాగం వరకు కాళ్ళను పైకి లేపి వర్టికల్ గా కాళ్ళను గాలిలోకి పైకి లేపుతూ సైకిలు తొక్కినట్లు కాళ్ళను గాలిలో తొక్కండి. ఈ రకమైన వ్యాయామాలు ప్రతి దినం కనీసం ఒక గంట పాటు చేస్తే మీరు కలలు కనే బాడీ షేప్ మీ సొంతమైపోతుంది.