ఆలివ్ నూనె వృద్ధుల్లో స్ట్రోక్ రిస్క్‌ను సగానికి సగం తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బోర్డియక్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు మూడు ఫ్రెంచ్ సిటీల్లో నివసించే 65 సంవత్సరాల వయసులో గల వారి 8000 వైద్య రికార్డులను పరిశోధించినట్లు మెడికల్ జర్నల్ న్యూరాలజీలో ప్రచురించబడింది.
ఐదేళ్ల పాటు సాగిన ఈ పరిశోధనలో వృద్ధుల్లో ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించడం ద్వారా సగానికి సగం స్ట్రోక్ రిస్క్ తగ్గిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వంటల్లో ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించడం, అలాగే స్నానానికి ముందు ఆలివ్ ఆయిల్ ఉపయోగించిన వృద్ధుల్లో 41 శాతం స్ట్రోక్ తగ్గిందని పరిశోధనలో తేలింది.
ఆలివ్ నూనెలో మరే ఇతర నూనెలలో లేని అతి విలువైన యాంటీ ఆక్సిడెంట్లు వుంటాయి. మహిళల స్తనాలు, పురుషుల ప్రొస్టేటు గ్రంధి, జీర్ణ వ్యవస్ధ మొదలైన వాటిలో గల పుండ్లను నివారించటానికి కూడా ఆలివ్ ఆయిల్ వాడతారు. ఆలివ్ నూనెలోని మోనో అన్ శాట్యురేటెడ్ ఫ్యాట్స్, ఓలెక్ యాసిడ్ లు గుండె జబ్బుల నివారణకు తోడ్పడతాయి.