ఇక్కడ నా అనుభవం చెపుతాను. నేను రెండు సంస్థలలో కూడా ఎన్నో ఆర్డర్స్ పెట్టాను. అమెజాన్ నుండి అయితే అసలు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది పడలేదు. ఏదయినా వస్తువు మనం రిటర్న్ పెట్టినా కూడా చాలావరకు మన డబ్బు వెంటనే మన అకౌంట్లో వచ్చేస్తుంది. ఒకవేళ మనకు ఏదయినా ఇబ్బంది కలిగి కస్టమర్ కేర్ వారితో మాట్లాడలన్న కూడా అతి సునాయాసంగా మాట్లాడవచ్చు. అదే flipkart అయితే ముందుగా మనం chatbot కి మన సమస్య వివరించాలి దానిని బట్టి అది కస్టమర్ కేర్ కి అనుసంధానిస్తుంది. అది కూడా ఆ అకౌంట్ ఎవరి పేరున ఉందొ వారి ఫోన్ నెంబర్ కి మాత్రమే ఫోన్ కలుపుతుంది. ఉదాహరణకు మీరు మీ ఫోన్ ద్వారా వేరే మీ వాళ్ళ యొక్క అకౌంట్ లో లాగిన్ అయి ఆర్డర్ పెడితే, flipkart తో మాట్లాడాలంటే మీ నెంబర్ కుదరదు. అసలు ఖాతా ఉన్న వారి నెంబర్ తోనే సాధ్యం. ఇదొక పెద్ద లోపం flipkart లో.
నేను పెట్టిన cod/pod ఆర్డర్స్ ఎక్కువగా క్యాన్సల్ అయ్యేవి.ఒకసారి డెలివరీ బాయ్ ని అడిగా. వాడు చెప్పిన సమాధానం విని విస్తుపోయా ఎక్కువగా cod లేదా pod ఆర్డర్ పెడితే, పెట్టినవారు తీసుకుంటారో లేదో అని వాళ్ళే క్యాన్సల్ చేసేసి, ఆర్డర్ rejected, లేదా package damaged అని రిటర్న్ చేసేస్తారంట.ఇదే విషయం c.care కి చాట్ చేసి, పిర్యాదు నెంబర్ అడిగితే, నా చాట్ close చేసేసారు.పైగా మరల ఆర్డర్ పెట్టుకోండి అని చచ్చు సలహా ఒకటి.ఈ నెలలో నా ఆర్డర్స్ 3 అలాగే క్యాన్సల్ చేసేసారు.
నా దృష్టిలో అమెజాన్ బెస్ట్..
ఇంకో విషయం, flipkart లో ఎక్కువగా used, rejected, సెకండ్స్ వస్తాయని, పుకార్లు. నాకు ఈ నెలలో ఒక iron box వచ్చింది. దానినిండా గీతలు, గారంటీ కార్డ్ లేదు, అట్ట పెట్టి పూర్తిగా పాడయిపోయి ఉంది. పైన flipkart వారి యొక్క packing కూడా లేదు .అది వచ్చిన రోజుకు తయారు అయి 2 సంవత్సరాలు అయింది. అలా 2 ఇయర్స్ ఓల్డ్ ఐటమ్ నాకు వచ్చింది.