Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

దక్షిణభారత అమర్‌నాథ్ గా పేరుగాంచిన సలేశ్వరం ఎక్క‌డ ఉందో తెలుసా..? దాని ప్ర‌త్యేక‌త‌లు ఇవే..!

Admin by Admin
March 8, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

దేశంలోనే కాకుండా ప్రపంచంలో ప్రసిద్ధిచెందిన శైవక్షేత్రం అమర్‌నాథ్. అచ్చం అలానే ఎత్తైన గుట్టలు, లోతైన లోయల మధ్య వెలిసిన శైవక్షేత్రం దక్షిణ భారతదేశంలో సైతం ఒకటున్నదన్న విషయం చాలామందికి తెలియదు. కానీ మన నల్లమల అడువుల్లో శ్రీశైలానికి దగ్గర్లో ఉంది. సుమారు 300 అడుగుల ఎత్తునుంచి పరవళ్లుతొక్కే గంగమతల్లి, ఎత్తైన కొండల మధ్య వెలిసిన దివ్యక్షేత్రమే సలేశ్వరం. నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో నల్లమల అడువుల్లో వెలిసిన పరమపవ్రిత, శక్తివంతమైన శైవ క్షేత్రం. అటు భక్తులను, ప్రకృతి ఆరాధకులను, సాహసీకులను మైమరపించే క్షేత్రం సలేశ్వరం.

నల్లమల అడవుల్లో సాగించే ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదకరం.. ఎత్తైన కొండలు.. ఆ వెంటనే లోయలు.. పక్షుల కిలకిలరా-వాలు.. దట్టమైన అటవీ ప్రాంతాన్ని దాటుకుంటూ సాగించే ప్రయాణంలో అనేక అనుభూతులుంటాయి. ప్ర‌తి ఏటా మార్చి, ఏప్రిల్ నెల‌ల్లో ఇక్క‌డ ఉత్స‌వాలు జ‌రుగుతుంటాయి. దారిపొడవునా అటవీ అందాలు, ప్రముఖ శైవ క్షేత్రాలు, కనువిందు చేసే జలపాతాలు, అనేక రకాల వన్యప్రాణులు యాత్రికులను ఇట్టే కట్టిపడేస్తాయి. దాదాపు 35 కి.మీ. పొడవునా దట్టమైన అడవిలో సాగే యాత్రలో 3 కి.మీ. కాలినడకనే కొండలు, గుట్టలు దాటుకుంటూ సలేశ్వరం ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. దక్షిణభారత అమర్‌నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం సాహసయాత్ర విశేషాలు ఇవే.

saleshwaram and its importance how to go

నిజానికి ఈ క్షేత్రం ఎప్పటితో ఎవ్వరికి తెలియదు. పురాణ కాలం నుంచి ఈ క్షేత్రం ఉన్నట్లు కథనాలు ఉన్నాయి. తపస్సు చేసుకునేవారికి ఇది అనువైన స్థలమని పలువురు పండితులు పేర్కొంటున్నారు. ఈ చుట్టు పక్కల అడువుల్లో, గుహల్లో ఎందరో తపం ఆచరిస్తుంటారని ప్రతీక. అయితే ఇక్కడి ఆదివాసీల కథనం ప్రకారం ఐదారు శతాబ్దాల క్రితం ఈ క్షేత్రాన్ని తమ పూర్వీకులు కనుగొన్నారని వారు చెపుతున్నారు. అపటినుంచి లింగమయ్య ఆలయంలో ఆదివాసీలే పూజారులు. సలేశ్వరంలో వెలసిన లింగమయ్య (లింగం)ను భక్తులు తాకినప్పుడు కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. అందువల్లే కదిలే లింగమయ్యగా ఆదివాసీ పెద్దలు చెబుతుంటారు. ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమిన‌ ఆదివాసీలు ప్రత్యేక దినంగా భావిస్తుంటారు. పౌర్ణమి రోజు అర్ధరాత్రి ఆలయం ఎదుట ఉన్న గుండంలో చంద్రకాంతి పడటం వలన ఆ కాంతిలో పుణ్యస్నానాలు చేస్తే శుభం జరుగుతుందని భక్తుల నమ్మకం.

280 అడుగులపైనుండి జాలువారే జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. అక్కడ‌నే మరో గుహలో శనేశ్వరుని ఆలయం చాళక్యులు, చోళులు, పాండ్యులు, జైన, బుద్ధ, వైష్ణవుల కాలంలో చెక్కిన రాతి విగ్రహాలు ఉన్నాయి. సలేశ్వరం వద్ద జాలువారే జలపాతం రెండు కొండల మధ్య సహజసిద్ధంగా లింగాకారంలో గుండంగా ఏర్పడింది. దీని లోతు సుమారు వంద అడుగులు ఉన్నట్లు ఆదివాసీలు చెబుతారు. జలపాతం చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఉత్సాహంగా తరలివస్తుంటారు. నల్లమల అటవీ మార్గంలో కాలినడకన చేరుకున్న భక్తులకు సుమారు 280 అడుగుల పైనుంచి జాలువారే జలపాతం ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. అయితే జలపాతం ఎక్కడనుండి పారుతుందో ఇప్పటికీ ఎవరికి అంతు చిక్కడం లేదు. ఇక్కడ అన్ని కాలాల్లోనూ నీరు పైనుంచి జాలువారుతూనే ఉంటుంది. ఇదిలా ఉండగా మండు వేసవిలో నెమ్మదిగా జాలువారే జలపాతం.. భక్తులు పెరుగుతున్న కొద్దీ జలపాతం మరింతగా పెరుగుతుందని ఇక్కడి ఆదివాసీల నమ్మకం.

Tags: saleshwaram
Previous Post

కొవ్వు పదార్థాలు తీసుకోవడం ద్వారా విచారానికి చెక్!?

Next Post

ఎలాంటి స‌మ‌స్య ఉన్నా స‌రే హ‌నుమాన్‌ను పూజిస్తే పోతుంది..!

Related Posts

Off Beat

విమానం రెక్క‌లు వంగి ఎందుకు ఉంటాయో తెలుసా..?

July 20, 2025
ఆధ్యాత్మికం

మొలతాడు ఎందుకు కడతారో తెలుసా..?దీని వెనుక సైన్స్ ఏంటి అంటే.??

July 20, 2025
mythology

పుష్ప‌క విమానం ఎవ‌రిదో తెలుసా??

July 20, 2025
హెల్త్ టిప్స్

మీ శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్నాయా..? అయితే ఈ డైట్ ను పాటించండి..!

July 20, 2025
వైద్య విజ్ఞానం

ఈ అల‌వాట్లు మీకు ఉన్నాయా..? అయితే జాగ్ర‌త్త‌.. మీ మాన‌సిక ఆరోగ్యం పాడవుతుంది..!

July 20, 2025
lifestyle

పీడ‌క‌ల‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా..? అయితే ఈ టిప్స్‌ను పాటించండి..!

July 20, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.