యుక్త వయసు వచ్చిందంటే యువతీ యువకుల్లో మొటిమల సమస్య మొదలవుతుంది. కొన్ని హార్మోన్లు పెరిగటం వలన వచ్చే ఈ మొటిమలు వారికి మనశ్శాంతిని దూరం చేస్తాయి. మొటిమల నివారణకు, లేక అవి రాకుండాను సహజంగా ఏ రకమైన ఆహారాలు తీసుకుంటే బాగుంటుందో పరిశీలిద్దాం. తీసుకునే ఆహారంలో పీచు అధికంగా వుండాలి. ఇది శరీరంలోని విష పదార్ధాలను తొలగించి చర్మాన్ని కాపాడుతుంది. పీచు అధికంగా, కేరట్లు, కేబేజి, బీట్ రూట్, బ్రొక్కోలి, చిక్కుడు గింజలు, ఉల్లిపాయ, బంగాళదుంప, గోంగూర, కాలీఫ్లవర్ మొదలగు వాటిలో వుంటుంది.
పండ్లలో ఆపిల్, అరటిపండు, అవకాడో, స్త్రాబెర్రీలు, రేగుపండ్లు, ఆరెంజ్, ద్రాక్ష, బ్లూ బెర్రీస్, చిన్నరేగి, పియర్ బాదం, మొదలైనవి అధికంగా పీచు కలిగి వుంటాయి. వీటిని మీ ఆహారంలో భాగంగా చేయండి. వెల్లుల్లి, అల్లం మొటిమలు తగ్గటానికి బాగా తోడ్పడతాయి. కనుక వీటిని మీరు తినే ఆహార పదార్ధాలకు జోడించండి. తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు అధికంగా వుంటే అవి ఎంజైములను పెంచి నూనె గ్రంధులను నియంత్రించటం, చర్మ రంధ్రాలు స్వేచ్చగా వుండటంలో తోడ్పడతాయి. సంపూర్ణమైన బ్రెడ్, బీఫ్, గుడ్లు, చేప, జున్ను, కొబ్బరి, ఉడికించిన గింజు,లు కేరట్లు, అవకాడో, బాదం మొదలైనవి ప్రొటీన్లు అదికంగా కలిగా వుంటాయి.
విటమిన్లు అధికంగా వుండే కూరలు, ఆకు కూరలు, చిలకడదుంప, కార్న్, మాంసం, సీఫుడ్, మామిడి పండ్లు, బొప్పాయి, టొమాటో, ఓట్లు వీటిలో విటమిన్లు వుంటాయి. జింక్ అధికంగా వుండే ఆహారం కూడా తీసుకోవాలి. గ్రీన్ టీలో వుండే ఔషధ గుణాలు మొటిమలను తగ్గిస్తాయి. ప్రతి రోజు ఒక కప్పు గ్రీన్ టీ తీసుకుంటే వీరికి చాలా మంచిది. చర్మం కాంతివంతంగాను, జుట్టు బలంగా కూడా ఎదుగుతాయి. శరీరంలోని అధిక అయోడిన్ తగ్గించాలి. నూనె తిండ్లు, లేదా చిప్స్ తినరాదు. ప్రతి రోజూ 8 నుండి 10 గ్లాసులు నీరు అంటే సుమారుగా 3 లీటర్ల నీరు తాగి శరీరంలోని మలినాల్ని విసర్జించాలి. ప్రతిరోజు క్రమం తప్పని వ్యాయామం దానితోపాటు ఎనిమిది గంటల నిద్ర, ఆహారంతో పాటు కలిగి వుంటే మొటిమలు పూర్తిగా నివారించటమే కాక, కాంతులీనే చర్మం, మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.