Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

చిత్త కార్తె కుక్క అనే మాట ఎలా వచ్చింది? చిత్త నక్షత్రానికి, కుక్కలకు ఏమైనా సంబంధం ఉందా?

Admin by Admin
March 13, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చిత్త కార్తె కుక్క అనే వాడుకకు అర్ధం తెలుసుకునే ముందు, కార్తె అంటే ఏమిటో సంక్షిప్తంగా చెబుతాను. జ్యోతిషులు, వగైరాలు 27 నక్షత్రాల ఆధారంగా ఎలా జాతకాలు, పంచాగాలు వ్రాస్తారో, అలాగే మన రైతులు నక్షత్రాల ఆధారంగా వ్యవసాయ కాలాలు తద్వారా వ్యవసాయ పంచాంగాలు వ్రాసారు. ఆ కాలాలకు కార్తెల‌ను పేర్లు పెట్టారు. సూర్యుడు ఏ రకంగా అయితే రాశీ మండలాలలో ఉంటాడో అలాగే ఒక్కొక్క నక్షత్ర మండలంలోనూ ఉంటాడు. ఆలా ఉండే కాలాన్నే కార్తె అంటారు. ఏ కాలంలో సూర్యుడు ఏ నక్షత్రానికి ద‌గ్గరగా ఉంటాడో, ఆ కాలాన్ని ఆ కార్తెగా పిలిచేవారు. ఇలాంటి కార్తెలు 27 ఉన్నాయి. ఒక్కొక్క కార్తెకి నిర్దిష్టమైన వాతావరణం ఉంటుంది తదనుగుణంగా రైతులు వారి వారి వ్యవసాయ కార్యక్రమాలు చేసుకునేవారు.

ఇప్పుడు కార్తె అంటే అర్ధం అయ్యింది కదా.. చిత్త కార్తె అంటే తెలుసుకుందామని. కార్తెల వరుసలో 14వది అంటే చిత్తా నక్షత్రం ఉండే కాలాన్ని చిత్త కార్తె అంటారు. మన గ్రెగేరియన్ (అంటే వాడుకలో ఉన్న ఆంగ్ల) క్యాలెండరు ప్రకారం అక్టోబర్ నెలలో వస్తుంది. చిత్త కార్తె అంటే కూడా అర్ధం అయ్యింది కదా. ఇక పోతే సరిగ్గా ఇదే సమయములో కుక్కల్లో సంభోగం చేసే కోరిక ఉడుకు ఎక్కువుగా ఉంటుంది అని నమ్మకం. అలాగే నేను కూడా చాలా సార్లు గమనించాను. సంభోగ సమయములో ఈ ఉడుకు కుక్కలు కామ వాంఛతో ఆడ కుక్కల కొరకు వెంపర్లాడటం, కనిపించిన ఆడ కుక్క వెనుక వెళ్ళటం, అడ్డు వచ్చిన మొగ కుక్కలతో గొడవ పడటము జరుగుతుంది. అలానే పొరపాటున మనుష్యులు ఆ వైపుగా వెళ్లితే వాళ్ల పిక్క భక్షణం జరిగే ప్రమాదం కూడా ఉంది. ఇది వాటి సహజ నైజము.

how chitta karte kukka name come into effect

కాబట్టి అమ్మాయిల వెంట పడుతూ, జుగుప్సాకరమైన ప్రవర్తన చేస్తూ, జులాయి లాగ గొడవలు పడే మొగ పిల్లలని చిత్త కార్తె కుక్క అని తిడతారు.

Tags: street dogs
Previous Post

కళ్లు తిప్పుకోనివ్వని అందం.. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసిన ఈ భామను గుర్తుపట్టారా..?

Next Post

రైల్వే స్టేష‌న్‌కు ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ఎందుకు ఉంటుంది..?

Related Posts

హెల్త్ టిప్స్

రాత్రి పూట ఇలా చేస్తే ప‌డుకున్న వెంట‌నే నిద్ర ప‌ట్టేస్తుంది..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

భార‌తీయ మ‌హిళ‌ల్లో పెరుగుతున్న గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌.. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే జాగ్ర‌త్త‌..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

మీకు డ‌యాబెటిస్ ఉందా..? అయితే మీ చ‌ర్మం ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

July 4, 2025
international

పాకిస్థాన్‌తో భార‌త్ ర‌ద్దు చేసుకున్న నీటి ఒప్పందం క‌రెక్టే అంటారా..?

July 4, 2025
business

ఎలాన్ మస్క్‌ను నేటి తరంలో అత్యుత్తమ శాస్త్రవేత్త అనవచ్చా? కేవలం వ్యాపారవేత్త అనుకోవాలా?

July 4, 2025
inspiration

పేద‌రికాన్ని ఎగ‌తాళి చేయ‌కూడ‌దు.. ప్ర‌తిభ ఎక్క‌డ ఉన్నా ప్రోత్స‌హించాల‌ని చెప్పే క‌థ‌..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.