రాకెట్లను అంతరిక్షంలోకి పంపాలంటే చాలా ఖర్చు అవుతుంది. మస్క్ తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి రాకెట్ పంపాలనుకున్నాడు. తన దగ్గర ఉన్న 180 మిలియన్ డాలర్లలో 100 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి స్పేస్ ఎక్స్(SpaceX) అనే కంపెనీ మొదలుపెట్టాడు. స్పేస్ ఎక్స్ నిర్మించిన మొదటి రాకెట్ లాంచ్ అయిన 33 సెకండ్ల తర్వాత పేలిపోయింది. గొప్ప శాస్త్రవేత్తలు, నాసా చేయవలసిన పనిని ఒక ప్రైవేట్ కంపనీ ఎలా చేయగలుగుతుంది అని అందరూ అవహేళన చేశారు. ఆ తర్వాత 2007లో రెండో రాకెట్ అంతరిక్షం దాటి ఆర్బిట్ చేరుకుంటున్న సమయంలో ఆగిపోయింది. 2008లో మూడో రాకెట్ కూడా ముక్కలయిపోయింది. చివరికి నాల్గవ రాకెట్ విజయవంతం అయ్యింది. ఆ తర్వాత నాసా ఇంటర్నేష్నల్ స్పేస్ స్టేషన్‌కి గూడ్స్ పంపడానికి స్పేస్ ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. నాసాతో ఒప్పందం కుదుర్చుకున్న మొట్టమొదటి కంపనీగా స్పేస్ ఎక్స్ నిలిచింది.
మస్క్ పెట్రోల్, డీజిల్ వల్ల వచ్చే కాలుష్యాన్ని తగ్గించాలనుకున్నాడు. దాని కోసం ఎలక్ట్రిక్ కార్లు తీసుకురావాలనుకున్నాడు. కానీ ఎలక్ట్రిక్ కార్లు తయారుచేయడం అంటే మాటలు కాదు. వాటిలో ఉపయోగించే బ్యాటరీ ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. ఛార్జింగ్ తక్కువసేపు వస్తుంది. కార్ వేగం కూడా తగ్గుతుంది. అప్పటికే ఉన్న టెస్లా అనే ఎలక్ట్రిక్ కార్ కంపనీలో చాలా మొత్తంలో ఇన్వెస్ట్ చేసాడు. అప్పటికి టెస్లా కంపనీ పరిస్థితి ఏం బాలేదు. టెస్లా కంపనీ టెస్లా రోడ్ స్టార్ వన్ అనే మోడల్‌ని తయారుచేసింది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 360 కి.మీ వెళ్తుందని కంపనీ ప్రకటించింది. కానీ బీబీసీ చానెల్లో వచ్చే ప్రోగ్రామ్లో టెస్లా కార్ టెస్ట్ డ్రైవ్ చేస్తున్న సమయంలో 80 కి.మీ వెళ్ళి ఆగిపోయింది. దానివల్ల టెస్లా మీద అందరికీ నమ్మకం పోయింది. కంపనీ బోర్డ్ మీటింగ్లో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మస్క్ తన దగ్గర ఉన్న 40 మిలియన్ డాలర్లు, తన కోసం ఏమీ మిగుల్చుకోకుండా ఇచ్చేసాడు. తర్వాత టెస్లా మాములు కార్ కన్నా ఎక్కువ సామర్ధ్యం ఉండేలా, లగ్జరీ కార్స్‌కి ఏమాత్రం తీసిపోకుండా ఒక కార్ తయారు చేసింది.
అదే టెస్లా మాడల్ ఎస్. ఒకప్పుడు 80 కి.మీ దగ్గర ఆగిపోయిన కారును ఇప్పుడు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1078 కి.మీ నడిచేలా తయారుచేసాడు. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) ఈ కారుకి 5కి 5.4 రేటింగ్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆటోమొబైల్ చరిత్రలో ఏ కారుకి దక్కని అరుదైన ఘనత అది. ఇప్పుడు టెస్లా నుంచి డ్రైవర్లు అవసరం లేని కార్లు కూడా వచ్చాయి. భవిష్యత్తులో ఏఐ(AI) రోబోట్ల వల్ల మానవజాతికి ప్రమాదం ఉందని, దాన్నుంచి మానవులని కాపాడే టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి న్యూరాలింక్(Neuralink) అనే కంపనీ కూడా మొదలుపెట్టాడు. మన ఆలోచన ద్వారా బయట ఉన్న వస్తువులను కంట్రోల్ చేసే టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాడు. మస్క్ హైపర్లూప్స్, భూమి మీద మనుషులను ఒక చోట నుంచి ఇంకో చోటకి రాకెట్లు ఉపయోగించి చేర్చే టెక్నాలజీ మీద పనిచేస్తున్నాడు. ఇది చివరి దశలో ఉంది.
హైపర్లూప్ అంటే పెద్ద పెద్ద ట్యూబ్స్ ద్వారా విమానాల కన్నా రెట్టింపు వేగంతో, తక్కువ ఖర్ఛుతో ఒక చోట నుంచి మరో చోటుకి సులభంగా ప్రయాణించే టెక్నాలజీ. ఒక రాకెట్‌ను పైకి పంపడం సులభమే కానీ అదే రాకెట్‌ను నిటారుగా కిందకి ల్యాండ్ చేయడం చాలా కష్టం. మస్క్ అది కూడా చేసి చూపించాడు. ఇతన్ని రియల్ లైఫ్ ఐరన్ మ్యాన్ అని అంటారు. నిజానికి మార్వెల్ సినిమాల్లోని ఐరన్ మ్యాన్ పాత్రకి, మస్కే ప్రేరణ. మార్స్ మీదకి మనుషులని పంపడానికి స్పేస్ ఎక్స్ ప్రయోగాలు కూడా జరుపుతుంది. మరి ఈ తరంలో టెక్నాలజీని ఇంత అభివృద్ధి చేసి, ఇంకా చేస్తున్న మస్క్ ని అత్యుత్తమ శాస్త్రవేత్త అని అనడంలో ఎటువంటి తప్పు లేదు.