నా ఫోనులో ఫోటోలు ఉన్నాయి వాటిని నేను నా స్నేహితుడికి పంచుకోవాలి ఎలా? మీరు ఏముందీ! బ్లూ టూత్ ద్వారా పంపండి అని చెప్తారు కదా! ఇప్పుడు రెండు ఫోన్లు ఒక రేడియోతరంగాల తో కలిపి వాటి మధ్య ప్రోటోకాల్ అనబడే కొన్ని పద్ధతుల ద్వారా సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం జరగొచ్చు.అలాగే మీ ఇంట్లో లేదా కార్యాలయంలో అనేక కంప్యూటర్లు ఒకదానికి ఒకటి కేబుల్ అనే తీగల ద్వారా కలిపి సమాచారం,ప్రింటర్లు,స్కానర్లు మీరు పంచుకుంటారు.ఇది మీ కార్యాలయం లేదా ఇల్లు ,హోటల్ లేదా ఇతర పరిమిత ప్రదేశంలో ఉంటే దాన్ని LAN అంటారు కదా, అలాగే ప్రపంచంలో ఏ మూల అయిన కంప్యూటర్లు సమాచారం ఇచ్చి పుచ్చుకునే వ్యవస్థ అంతర్జాలం.దీన్ని ఈ లోకపు సాలెగూడు అంటే ఎలా ఉంది?
సాలే గూడులా ప్రపంచంలో ఉన్న కంప్యూటర్లు మీ స్మార్ట్ ఫోన్లు సహా ఇలా అల్లుకుపోయి ఉంటాయి. అవి టీసిపి/ఐపీ అనే పద్ధతిన ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఇలా కంప్యూటర్లు ముచ్చట పెట్టుకోవటం కోసం రేడియో తరంగాలు పంపటం కోసం ఆప్టికల్ ఫైబర్ తీగలు లేదా దేశాల మధ్య సంద్రం వెంట తీగల కట్టలు ఎంతో కష్టపడి వేశారు.మన ఫోన్లకు కంప్యూటర్లకు ఇవన్నీ కలపబడి ఉంటాయి.మీ బ్రాడ్బ్యాండ్ అనబడే అంతర్జాల కనెక్షన్లు లేదా మొబైల్ ఫోను కనెక్షన్లు అన్నీ ఉపగ్రహం సముద్రంలో ఉండే తీగల ద్వారా ఇలా కలిపి ఉంటాయి.వీటికి బాగా ఖర్చు అవుతుంది అందుకే ఛార్జీలు వసూలు చేస్తారు.
ఏ మాధ్యమం అయిన దానికి సమాచారం పెంచుకోవటానికి బ్యాండ్విడ్త్ అనే ఒక హద్దు ఉంటుంది ఆ మేరకు అవి సమాచారం పంపి తీసుకోగలవు. ఆయా దేశాల ప్రభుత్వాలు ఈ రేడియో అలల పై హక్కులను నియంత్రిస్తూ వేలం ద్వారా వ్యాపారాలకు లైసెన్సు రూపంలో అమ్ముతూ ఉంటాయి.ఇలా వాళ్ళు మనకు తిరిగి అమ్మి వ్యాపారం చేస్తూ ఉంటారు.ఇది చాలా లాభసాటి వ్యాపారమే!