Money Plant : మనీ ప్లాంట్ అంటే సహజంగానే చాలా మంది వాస్తు కోసం ఇంట్లో పెట్టుకోవాలని అనుకుంటారు. అది నిజమే. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్‌ను పెంచడం వల్ల లక్ కలసి వస్తుందని, అదృష్టం తలుపు తడుతుందని, ధనం బాగా లభిస్తుందని.. చెబుతారు. అయితే ఆ విషయాలను పక్కన పెడితే.. మనీ ప్లాంట్‌ను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆరోగ్యం మాత్రం బాగు పడుతుంది. ఎందుకంటే మనీ ప్లాంట్‌తో పలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి మరి..! ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మనీ ప్లాంట్‌ను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో గాలి పరిశుభ్రంగా మారుతుంది. గాలిలో ఉండే కాలుష్య కారకాలు తగ్గిపోతాయి. గాలిలో ఉండే బెంజీన్, కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్, జైలీన్ వంటి కాలుష్య కారకాలు తొలగిపోయి గాలి శుభ్రంగా మారుతుంది. దీంతో స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవచ్చు. ఇంట్లో అందరికీ స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.
2. మనీ ప్లాంట్‌ను ఇంట్లో బెడ్ రూమ్, హాల్, స్టడీ రూమ్‌లలో పెట్టుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. వాటిని చూస్తే పచ్చని ప్రకృతిలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది కనుక ఒత్తిడి అంతా తగ్గిపోతుంది.
3. ఇంట్లో మనం డెస్క్‌టాప్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. వీటితో రేడియేషన్ స్థాయిలు మన ఇంట్లో ఎక్కువగానే ఉంటాయి. అయితే మనీ ప్లాంట్‌ను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆయా వస్తువుల నుంచి వెలువడే రేడియేషన్ తగ్గిపోతుంది. దీంతో రేడియేషన్ బారి నుంచి సురక్షితంగా ఉండవచ్చు.
4. ఇంట్లో వైఫై రూటర్లు ఉంటే వాటి సిగ్నల్స్ ప్రభావం చిన్నారులు, వృద్ధులపై పడుతుంది. కనుక ఇంట్లో మనీ ప్లాంట్‌ను పెట్టుకుంటే ఆ సిగ్నల్స్ ప్రభావం తగ్గిపోతుంది. చిన్నారులు, వృద్ధులు ఆరోగ్యంగా ఉంటారు.
ఈ విధంగా మనీ ప్లాంట్‌తో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అయితే వాస్తు పరంగా చూస్తే మనీ ప్లాంట్ వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో ఇంట్లో కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. ఆర్థిక సమస్యలు పోతాయి.