సాధారణంగా చాలామంది బీరు ఇష్టపడో లేక కొన్నికాలాల్లో ఆరోగ్యానికి మంచిదనో లేదా స్నేహితుల ఒత్తిడి వల్లో తాగేస్తూంటారు. ఇక సిటింగ్ లో వైన్ లేదా లిక్కర్లకంటే కూడా బీర్ ను అధికంగానే తాగేస్తారు. బీరు ఆల్కహాల్ అంత ఘాటైనది కాదుగానీ, అధికంగా తాగితే గుండెలో మంట వస్తూంటుంది. గుండె మంట తగ్గాలంటే..
పొద్దుపోయి – బీరు ప్రభావం గుండెపై పడరాదంటే, బీరును రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత తాగవద్దు. నిద్రకు బీరు తాగుడుకు మధ్య అధిక సమయం వుండాలి. కావలసినంత జీర్ణక్రియ ఏర్పడి గుండెపై దాని ప్రభావం తగ్గుతుంది. రాత్రివేళ గుండె మంట వచ్చే అవకాశం వుండదు. నీరు తాగండి – మరో చిట్కాగా, బీరు తాగిన తర్వాత నీరు అధికంగా తాగితే, బీరు ప్రభావం తగ్గటమే కాక, గుండె మంట, పొట్ట గడబిడవంటివి కలిగే అవకాశం వుండదు.
అంతేకాదు, సాధారణంగా డీహైడ్రేషన్ వలన ఏర్పడే హేంగోవర్ కూడా దూరమవుతుంది. యాంటాసిడ్లు – తాగుతున్నారని తెలిసినపుడు దాని ప్రభావం గుండెపై తగ్గించటానికి ముందు జాగ్రత్తగా యాంటాసిడ్లు కూడా వేయవచ్చు.