Fat : అధిక బరువును తగ్గించుకోవడం కోసం ప్రస్తుతం చాలా మంది అనేక అవస్థలు పడుతున్నారు. నిత్యం వ్యాయామం చేయడంతోపాటు ఆహారం విషయంలోనూ అనేక మార్పులు చేసుకుంటున్నారు. అయినప్పటికీ కొందరు బరువు తగ్గడం లేదని చింతిస్తున్నారు. అయితే అలాంటి వారు కింద తెలిపిన విధంగా ఓ డ్రింక్‌ను తయారు చేసుకుని రోజుకు రెండు సార్లు తాగాలి. దీంతో అధిక బరువును తగ్గించుకోవచ్చు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ముఖ్యంగా పొట్ట, పిరుదులు, తొడల వద్ద ఉండే కొవ్వు కరిగిపోయి నాజూకుగా తయారవుతారు. అయితే ఆ డ్రింక్‌ను ఎలా తయారు చేయాలంటే..
ఒక పాత్ర తీసుకుని అందులో రెండు గ్లాసుల నీటిని పోయాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. నాలుగు చిన్న దాల్చిన చెక్క ముక్కలను కూడా అందులో వేయాలి. తరువాత 2 యాలకులను దంచి వేయాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని 8 నుంచి 10 నిమిషాల పాటు సన్నని మంటపై మరిగించాలి. అనంతరం స్టవ్ ఆర్పి మిశ్రమాన్ని వడకట్టాలి. అది గోరు వెచ్చగా ఉండగానే కప్పు మోతాదులో తీసుకుని అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం, నల్ల ఉప్పు కలిపి తాగేయాలి.
ఇలా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుని రోజూ ఉదయం, సాయంత్రం ఒక కప్పు మోతాదులో తాగుతుండాలి. దీంతో అధిక బరువు తగ్గుతారు. పొట్ట, పిరుదులు, తొడల వద్ద ఉండే కొవ్వు కరుగుతుంది.
ఈ మిశ్రమంలోని జీలకర్ర అధిక బరువును తగ్గించేందుకు సహాయపడుతుంది. దీంతో కొవ్వు వేగంగా కరుగుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అజీర్ణం, గ్యాస్, మలబద్దకం ఉండవు. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఇక ఇందులోని దాల్చిన చెక్క శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. అధిక బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తుంది.
ఈ మిశ్రమంలో ఉండే యాలకులు మన శరీర మెటబాలిజాన్ని పెంచుతాయి. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఇలా ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తాగితే బరువును తగ్గించుకోవచ్చు. బరువు తగ్గడం సులభతరం అవుతుంది.