సినీ ప్రముఖుల జీవితానికి సంబంధించి మనకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. వాటిని తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తారు. అప్పట్లో రెండు సంవత్సరాల పాటు కరోనా కారణంగా సినీ పరిశ్రమ ఎంతో దెబ్బతింది. 2002 సంవత్సరం తరువాత కరోనా దూరమై మళ్ళీ పాత రోజులు వచ్చాయి. అయితే చాలామంది హీరోయిన్లు మంచి ఫామ్ లో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని అనుకుంటారు. అలా ఓవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు యాడ్స్ లో కూడా నటిస్తూ వచ్చిన డబ్బులను బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి లాభాలు పొందుతారు. అలా ఇండస్ట్రీలో అత్యంత సంపన్నులుగా ఉన్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
తన ప్రియుడు, డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకున్న నయనతార పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటిస్తోంది. ప్రస్తుతం నయనతార ఒక్కో సినిమాకి 10 కోట్లు పారితోషకం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నయనతార ఆస్తి విలువ దాదాపు 165 కోట్లు ఉంటుందట. 2007లో హ్యాపీడేస్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా 17 సంవత్సరాలు అవుతున్నా అదే అందంతో దూసుకుపోతోంది. పలు బ్రాండ్స్, శారీ షో రూమ్ లకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న తమన్నా వార్షిక ఆదాయం ప్రస్తుతం 12 కోట్లు ఉందట. తమన్నా మొత్తం ఆస్తి విలువ దాదాపు 110 కోట్లకు పైమాటే అని టాక్. ఈమె ప్రస్తుతం ఒక్కో సినిమాకి ఐదు కోట్ల వరకు పారితోషకం డిమాండ్ చేస్తుందట.
సూపర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనుష్క శెట్టి లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అనుష్క ఆస్తి దాదాపు 142 కోట్ల వరకు ఉంటుందట. పలు నగరాలలో అనుష్కకు విలువైన బంగళాలు, ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. ఏం మాయ చేసావే అంటూ అందరినీ మాయ చేసిన హీరోయిన్ సమంత ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు దాటింది. సమంత ఆస్తుల విలువ 97 కోట్ల వరకు అని సమాచారం. ఒక లైలా కోసం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన పూజా హెగ్డే ప్రస్తుతం ఒక్కో సినిమాకి రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటుంది. ప్రస్తుతం ఈమె ఆస్తుల విలువ 60 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. చలో చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ అయిన రష్మిక మందన్న ప్రస్తుతం ఒక్కో సినిమాకి నాలుగు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. రష్మిక మొత్తం ఆస్తులు విలువ 37 కోట్లు ఉంటుందని సమాచారం.