భారత్ – పాకిస్తాన్ పరస్పరం గగనతల నిషేధాలు అమలులోకి తీసుకువచ్చాయి. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ కేవలం 32 flights ఆపరేట్ చేస్తుంది. భారత్ లో రెండు ఎయిర్‌లైన్స్ ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే Indigo 372 విమానాలను, Air India 200 విమానాలను ఆపరేట్ చేస్తున్నాయి. మన విమానాలు వారి గగన తలాన్ని వినియోగించుకునేందుకు బోయింగ్ 737 విమానానికి ఐతే per flight $580 USD రుసుము చెల్లించే వాళ్ళం. Airbus 380 లాంటివాటికి రుసుము ఇంకా ఎక్కువ. భారత విమానాలకు overflight అనుమతులు , ల్యాండింగ్ , terminal navigation, parking charges 2019 లో నిరాకరించడం వల్ల $ 760,000 నష్టం ప్రతి రోజూ పాకిస్తాన్ కి వచ్చింది. 5 నెలల పాటు ఈ పరిస్థితి కొనసాగింది.
అప్పటి తో పోల్చుకుంటే, భారత్ నుంచి యూరోప్ ట్రాఫిక్ 80% పెరిగింది. ప్రస్తుతం భారత్ నుంచి 242 services Europe కి , 144 services అమెరికా కి వెళ్తాయి ( వారం లో). Pakisthan airspace వాటికి కీలకం. కాబట్టి, ఆ ఆదాయం 2019 కన్నా చాలా ఎక్కువ అది పాకిస్తాన్ కోల్పోతుంది. ( Long routes తీసుకోవడం వల్ల పెరిగే నష్టం భారత ప్రయాణికులు భరించాల్సి వస్తుంది, 12 నెలలకి అంచనా వేసిన నష్టం $600 నుంచి 750 మిలియన్ లు మనకి) పాకిస్తాన్ విమానాలు మన గగనతలం వినియోగించుకోవడం వల్ల మనకి వచ్చే ఆదాయం పెద్దగా లేదు, కావున, ప్రభుత్వానికి loss పరిగణలోకి రాదు.
ఇక్కడ నష్టపోయేది.. పాకిస్తాన్ ప్రభుత్వం.. ( ప్రయాణికులకు పెద్ద ఇంపాక్ట్ లేదు). భారత ప్రయాణికులు/దేశీ విమానయాన సంస్థలు ( భారత ప్రభుత్వానికి పెద్ద ఇంపాక్ట్ లేదు). భారత విమానయాన సంస్థలు కాకుండా వేరే ఎయిర్లైన్స్ కి ఈ నిర్బంధం లేదు కనుక ప్రయాణికులకు ఇబ్బంది రాకపోవచ్చు, Airlines కి మాత్రమే నష్టం రావచ్చు. అది కూడా మరో రూపం లో ప్రభుత్వం భర్తీ చేయవచ్చు.