బాదం పప్పులో విటమిన్ ఇ, మెగ్నీషియం, మేంగనీస్, అధిక మొత్తంలో పీచు, కాపర్, ఫాస్పరస్, రిబోఫ్లావిన్ లుంటాయి. అంతేకాక ఒక ఔన్సులో 13 గ్రాముల కొవ్వు, 1 గ్రాము సంతృప్త కొవ్వు వుండి కొల్లేస్టరాల్ లేకుండా వుంటాయి. ఆరోగ్యంగా జీవించాలంటే పోషకాలు కావాలి. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, ఫ్యాట్స్ వలెనే విలమిన్లు, మినరల్స్ కూడా అవసరం. గుండె సమస్యలు తగ్గించాలంటే ప్రతిరోజూ ఒక గుప్పెడు బాదం పప్పులు తింటే ఫలితాలు బాగా వుంటాయి.
బాదం పప్పు ప్రతి ఔన్సులో 6 గ్రాముల ప్రొటీన్, 3 గ్రాముల పీచు వుంటాయి. బాదంపప్పులు చిరు ఆహారంగా తీసుకోడం కొల్లెస్టరాల్, రక్తపోటు, షుగర్ వ్యాధులను తగ్గిస్తుంది. బాదం పప్పులలోని విటమిన్ ఇ ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్. అది శరీరంలోని ఫ్రీ రేడికల్స్ ను అరికడుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న బాదం పప్పులు ప్రతిరోజూ తింటే గుండె ఆరోగ్యమేకాక, మీ శారీరక ఆరోగ్యం కూడా ఎన్నో విధాలుగా మెరుగుపడుతుంది.
సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం రోజూ బాదం పప్పును తినే వారిలో గుండె జబ్బులు లేదా హార్ట్ ఎటాక్స్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గిందని గుర్తించారు. అందుకు కారణం ఏమిటంటే.. బాదంపప్పును తింటే రక్త నాళాల్లో ఉండే బ్లాక్స్ కరిగిపోతాయి. రక్త నాళాల్లోని అడ్డంకులు తొలగిపోతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో బీపీ తగ్గుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారిస్తుంది. కనుక బాదంపప్పును రోజూ తినాలని వారు సూచిస్తున్నారు.