మీకు అరటిపళ్ళు తినడమంటే చాలా ఇష్టమా? ఎస్ అని సమాధానం ఇచ్చే వారు కొందరైతే, నాకు ఇష్టంలేదు అని మరికొందరు చెబుతారు. అయితే మరి అరటి తొక్కను ఎంతమంది ఇష్టంగా తీసుకుంటారు అని అడిగితే, మరీ టూమచ్ చేస్తున్నాడని అనుకుంటారేమో, ఆ అనుమానం వస్తే మీరు తొక్కపై కాలు వేసినట్లే. ఎందుకంటే అరటితొక్కను తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. అవునా అంటూ ముక్కునవేలేసుకుంటారు. అరటితొక్క వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోండి. డిప్రెషన్, డల్ గా ఉండటం కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఆనందపడటం ప్రస్తుతం సగటు మనిషి జీవితంలో సాధారణం అయింది. ఇందులో సేరోటినీన్ ఉండటం వలన అది తీసుకున్నప్పుడు శక్తివంతంగా, సంతోషంగా ఉండే సామర్థ్యాన్ని కలిగిస్తుంది.
అరటికన్నా అరటితొక్కలో ఎక్కువగా జీర్ణం చేసుకునే పీచు పదార్థాలు ఉంటాయి. అందువల్ల కొవ్వుపదార్థాల స్థాయి తగ్గి, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సహాయపడుతుంది. అరటితొక్కలో పోషకాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి మరియు క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీని కారణంగా బరువు ఒకే విధంగా ఉంటూ, ఆరోగ్యంగా స్లిమ్ గా, ఫిట్ గా ఉంటారు. ఇందులో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉండటం వలన మన శరీరంలో ఆమ్ల నియంత్రణను బ్యాలెన్స్ గా సాగిస్తుంది. అరటితొక్కలో ట్రిప్టోఫాన్ మరియు అమైనో ఆమ్లం సమ్మేళనం ఉండటం వలన రాత్రి సమయాలలో హాయిగా నిద్రపడుతుంది.
క్యాన్సర్ కణితులు రాకుండా రక్షించే సమ్మేళనాలు అరటితొక్కలో ఉన్నాయి. ఎర్రరక్త కణాలు శరీరంలోకి ఆక్సిజన్ చేరవేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అరటితొక్కను తీసుకోవడం వలన ఎర్రరక్త కణాలు నిరోదించే శక్తి వాటిలో ఉంటుంది. లుటీన్ రాత్రి సమయాలలో చూపును పెంచుతుంది. అరటితొక్కలో అది సమృద్ధిగా ఉండటం వలన కంటిచూపు బాగా కనిపించడానికి సహాయపడుతుంది.