రోహిణి.. ఈవిడ తెలుగావిడే . తల్లిదండ్రులు ఇద్దరూ తెలుగువారే . ఈవిడ తెలుగులో బాల్యనటిగా ఎన్నో సినిమాలు చేసింది కానీ కథలో పెద్ద మలుపు లాగా ఈవిడ తమిళం, మలయాళం సినిమాలలో నెమ్మదిగా సినిమాలు చేయడం మొదలెట్టింది . అలా నెమ్మదిగా ఆ రెండు పరిశ్రమలలో ప్రసిద్ధి చెందింది. ఈవిడ ఇప్పటివరకు అన్నిటికంటే మలయాళం సినిమాలల్లో ఎక్కువగా నటించింది. అక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈవిడ ఇప్పటివరకు మలయాళం ,తమిళం సినిమాలలోనే తెలుగు కంటే ఎక్కువగా నటించింది . కొందరు ఈవిడను తమిళం అమ్మాయి, కొందరేమో మలయాళీ అని అనుకుంటారు . తప్పేమీ లేదు ఎందుకంటే ఎవరైనా తన సినిమా కెరీర్ చూస్తే అలానే అనుకుంటారు కానీ చాలామంది అసలు ఈవిడ తెలుగు ఆవిడే అనే విషయం మరిచిపోయారు.
ఈవిడ ఒక తమిళం ఇంటర్వ్యూ లో చెప్తుంది తనకు నచ్చిన పాత్రలు అన్నీ మలయాళం సినిమాలోనే ఎక్కువగా వచ్చాయి అందుకనే ఆ భాష సినిమాలు చేయడం ఎక్కువగా నచ్చుతుంది అని చెప్పింది. మలయాళంలో ఇప్పటివరకు 40 ఏళ్ల సినిమా కెరీర్ పూర్తి చేసుకుంది.
సంపత్ రాజ్.. ఈయన తండ్రి ఒక తెలుగు ఆయనే . మాతృ భాష తమిళం . కొన్నేళ్ళు బెంగళూరు లో చదివారు. ఈ విధంగా మూడు దక్షిణ భారతీయ భాషలు వచ్చు. ఈయన ఒక తెలుగు ఆయన అనే విషయం తెలియని వారు ఇంకా ఎందరో ఉన్నారు. 2003లో తన సినిమా కెరీర్ ను మొదలెట్టారు .ఈ మధ్యనే తెలుగు సినిమాలో ప్రసిద్ధి అయ్యారు . ఈయన కూడా తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేశారు కాబట్టి ఇతర పరిశ్రమలలో ఎక్కువగా ప్రసిద్ది అయిన తెలుగు వ్యక్తులలో ఈయన కూడా ఒకరు.
వీరిద్దరే కాకుండా జయం రవి, విశాల్, మురళి శర్మ, జానీ లివర్ ఇలా ఎందరో తెలుగువారు ఇతర సినీ పరిశ్రమలోని ఎక్కువగా ప్రసిద్ధి చెందారు . మురళి శర్మ వంటి తెలుగు వారు ఇతర సినీ పరిశ్రమలో పేరు తెచ్చుకుని మళ్లీ తెలుగులో తిరిగి వచ్చారు మిగతా వారు ఇతర సినీ పరిశ్రమలోనే స్థిరపడిపోయారు. వీరందరి ద్వారా మనకు తెలిసిన ఒక విషయం ఏమిటంటే మాతృభాష కంటే ఏ చోట అయితే పెరుగుతారో అక్కడే ప్రసిద్ధి చెందడం ఆయా భాషవారిగా మారిపోవడం సహజం. కొంత బాధగా కూడా అనిపిస్తుంది వీళ్లు మనవారు అయ్యి ఉండి వెరే సినీ పరిశ్రమలో ఎక్కువగా నటించడం, వీరందరూ మన సినీ పరిశ్రమలోనే ఎక్కువగా నటించి ఉంటే ఇంక ఎంత బాగుండేదో అని.