Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Coffee : రోజూ కాఫీ తాగడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా ? అసలు కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా ?

Admin by Admin
January 3, 2022
in వార్త‌లు, హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

Coffee : రోజూ ఉదయాన్నే బెడ్‌ మీదే కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. బెడ్‌ కాఫీ తాగనిదే కొందరు రోజును ప్రారంభించరు. ఇక కొందరు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌ అనంతరం, ఇంకొందరు రోజు మొత్తం కాఫీలను తాగుతుంటారు. చలికాలంలో వేడి వేడి కాఫీ గొంతులో పడుతుంటే వచ్చే మజాయే వేరు. కొందరు టీ తాగరు.. కానీ.. కాఫీ అంటే మాత్రం పడి చచ్చిపోతారు. అయితే రోజూ కాఫీ తాగడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా ? అసలు కాఫీ తాగడం మన ఆరోగ్యానికి మంచిదేనా ? అంటే..

are there any benefits drinking Coffee everyday or is it harmful for our body

కాఫీ తాగడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కాఫీలో ఉండే కెఫీన్‌ మనకు ప్రయోజనాలను అందిస్తుంది. ఇది మెదడును చురుగ్గా మారుస్తుంది. దీంతో యాక్టివ్‌గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఒత్తిడి, ఆందోళన పోతాయి. డిప్రెషన్‌ తగ్గుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రోజూ ఒత్తిడికి గురయ్యేవారు కాఫీ తాగితే ఎంతో మేలు చేస్తుంది.

కాఫీని తాగడం వల్ల శరీర మెటబాలిజం మెరుగు పడుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. శరీరంలో కొవ్వు కరుగుతుంది. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు. అందువల్ల కాఫీ బరువు తగ్గేందుకు మేలు చేస్తుంది.

టైప్‌ 2 డయాబెటిస్‌ ఉన్నవారు కాఫీ తాగడం వల్ల షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి. డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది. దీన్ని సైంటిస్టులు ప్రయోగాత్మకంగా నిరూపించారు కూడా.

వయస్సు మీద పడడం వల్ల ఎవరికైనా సరే సహజంగానే మతిమరుపు వస్తుంది. వృద్ధులు కొందరికి తీవ్రమైన అల్జీమర్స్‌ వస్తుంది. అయితే కాఫీ తాగుతుంటే ఆయా సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.

కాఫీ తాగడం వల్ల లివర్‌ ఆరోగ్యంగా ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. కాఫీ తాగితే డిప్రెషన్‌ తగ్గడంతోపాటు సూసైడ్‌ చేసుకోవాలనే ఆలోచనలు కూడా తగ్గిపోతాయని సైంటిస్టులు చెబుతున్నారు.

సైంటిస్టులు చేపట్టిన అధ్యయనం ప్రకారం రోజూ కాఫీ తాగే వారి ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుందని, వారు ఎక్కువ కాలం పాటు జీవిస్తారని వెల్లడైంది. అలాగే కాఫీ వల్ల కంగారు, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు.

అయితే కాఫీని రోజూ తాగవచ్చా ? అంటే.. అవును.. పైన తెలిపిన ప్రయోజనాలను పొందడం కోసం రోజూ కాఫీని తాగవచ్చు. కానీ రోజుకు రెండు కప్పులకు మించి కాఫీ తాగరాదు. ఎందుకంటే ఒక కప్పు కాఫీలో సుమారుగా 90 నుంచి 100 మిల్లీగ్రాముల కెఫీన్‌ ఉంటుంది. రెండు కప్పుల కాఫీ తాగితే మనకు 200 మిల్లీగ్రాముల మేర కెఫీన్‌ లభిస్తుంది. అయితే కెఫీన్‌ కేవలం కాఫీలోనే కాక ఇతర ఆహారాల్లోనూ ఉంటుంది. కనుక కెఫీన్‌ ఉన్న ఆహారాలను కూడా తీసుకుంటే మోతాదు పెరిగిపోతుంది. మనం రోజుకు గరిష్టంగా 300 మిల్లీగ్రాముల మేర కెఫీన్‌ తీసుకోవచ్చు. అంతకు మించితే దుష్పరిణామాలు ఏర్పడుతాయి. కనుక కెఫీన్‌ మోతాదు పెరగకుండా రోజూ కాఫీ తాగాలి. చిన్న కప్పు అయితే 3 నుంచి 4 కప్పులు, పెద్దవి అయితే 2 కప్పుల వరకు కాఫీని తాగవచ్చు. దీంతో కాఫీ వల్ల పైన తెలిపిన ప్రయోజనాలను పొందవచ్చు. అంతకు మించితే మాత్రం అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Tags: coffeeకాఫీ
Previous Post

Boiled Peanuts : వేరుశెనగలను ఉడికించి రోజూ తింటే.. ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలిస్తే.. అస్సలు విడిచిపెట్టరు..!

Next Post

Tablets : ట్యాబ్లెట్ల‌ను వేసుకునేట‌ప్పుడు ఎన్ని నీళ్ల‌ను తాగాలో తెలుసా ?

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను తింటే థైరాయిడ్ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది..!

July 4, 2025
చిట్కాలు

డెలివ‌రీ అయ్యాక మ‌హిళ‌ల‌కు ఏర్ప‌డే స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే ఇలా చేయండి..!

July 4, 2025
చిట్కాలు

ఈ ఒక్క చిట్కాను పాటిస్తే చాలు.. మీ లివ‌ర్ ఎల్ల‌ప్పుడూ క్లీన్‌గా ఉంటుంది..

July 4, 2025
ఆధ్యాత్మికం

ఈ పొర‌పాట్ల‌ను మీరు కూడా చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ధ‌నం నిల‌వ‌దు జాగ్ర‌త్త‌..!

July 4, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీపై ల‌క్ష్మీదేవి క‌టాక్షం వ‌ర్షిస్తుంది..!

July 4, 2025
vastu

వాస్తు ప్రకారం ఈ మొక్క‌ల‌ను ఇంటి ప్ర‌ధాన ద్వారం వద్ద పెంచ‌కూడ‌దు..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.