Mucus : ప్రస్తుతం చలి ఎక్కువగా ఉంది. బయట అసలు ఏమాత్రం తిరగలేని పరిస్థితి నెలకొంది. చల్లని గాలులు అందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో దగ్గు, జలుబు, జ్వరం వంటి శ్వాస కోశ సమస్యలు మరీ ఎక్కువయ్యాయి. ఊపిరితిత్తుల్లో బాగా కఫం పేరుకుపోవడం వల్ల జలుబు, ముక్కు దిబ్బడ, దగ్గు వంటి సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో చాలా మంది అవస్థలు పడుతున్నారు.
అసలే కరోనా సమయం. ఇలాంటి పరిస్థితిలో మనకు వస్తున్న దగ్గు, జలుబు వంటి సమస్యలు సహజమైనవేనా.. కరోనాతో వచ్చినవా.. అని తెలుసుకోవడం కష్టంగా మారింది. అయితే ఈ సమస్యల నుంచి బయట పడేందుకు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే వీటి నుంచి బయట పడవచ్చు. దీంతోపాటు ఛాతిలో ఉండే కఫం మొత్తం దెబ్బకు బయటకు పోతుంది. అందుకు ఏం చేయాలంటే..
దగ్గు, జలుబు సమస్యలను తగ్గించడంతోపాటు కఫం మొత్తాన్ని బయటకు పంపేందుకు లవంగాలు, అల్లం ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకు ఏం చేయాలంటే.. ఒక చిన్న అల్లం ముక్క, నాలుగు లవంగాలను తీసుకుని రెండింటినీ కలిపి దంచాలి. ఆ మిశ్రమాన్ని ఒక గ్లాస్ పాలలో వేసి బాగా మరిగించాలి. పాలు మరిగాక గోరు వెచ్చగా ఉండగానే అందులో తేనె కలిపి తాగేయాలి.
ఈ విధంగా రోజూ రాత్రి పూట నిద్రకు ముందు తాగాల్సి ఉంటుంది. రెండు రోజుల పాటు ఈ మిశ్రమాన్ని తాగాలి. దెబ్బకు ఛాతిలో ఉండే కఫం పోవడంతోపాటు దగ్గు, జలుబు నుంచి విముక్తి లభిస్తుంది. అయితే సమస్య ఇంకా తగ్గకపోతే ఇంకో రెండు రోజులు తాగవచ్చు.
ఈ మిశ్రమాన్ని గోరు వెచ్చగా తీసుకోవడం వల్ల ఛాతిలోని కఫం మొత్తం బయటకు పోతుంది. ముక్కు రంధ్రాలు క్లియర్ అవుతాయి. శ్వాస సరిగ్గా ఆడుతుంది. ముక్కు దిబ్బడ నుంచి బయట పడవచ్చు. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. దీని వల్ల గొంతు నొప్పి, గొంతులో మంట, ఇతర గొంతు సమస్యలు తగ్గిపోతాయి. అల్లం కఫాన్ని బయటకు పంపించడంలో సహాయ పడుతుంది.
ఇక లవంగాల్లో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సూక్ష్మ జీవులను నాశనం చేస్తాయి. దీంతో దగ్గు, జలుబు నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
సైనస్ సమస్య ఉన్నవారు సైతం ఈ మిశ్రమాన్ని తాగవచ్చు. దీంతో ఎంతో రిలీఫ్ లభిస్తుంది. శ్వాస కోశ సమస్యలు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చు.