విరాట్ కోహ్లి… ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెట్ ఆటగాళ్లలో ఒకడిగా పేరుగాంచాడు. వన్డేల్లో 14వేల పరుగుల మైలు రాయిని కూడా దాటాడు. తన 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. అయితే క్రికెటర్‌గా కోహ్లి ఎంతటి పేరుగాంచాడో సెలబ్రిటీగా కూడా అంతే పేరుగాంచాడు. ఈ క్రమంలోనే ఎన్నో కంపెనీలు కోహ్లిచే తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకుంటున్నాయి. అనేక యాడ్స్ ను అతనితో తీస్తున్నాయి. అయితే మీకు తెలుసా..? కోహ్లి యాడ్స్ చేసినందుకు ఒక రోజు పారితోషిం ఎంత తీసుకుంటాడో..? తెలిస్తే షాకవుతారు..!
విరాట్ కోహ్లి యాడ్స్‌ను షూటింగ్ చేసేందుకు ఏ కంపెనీకి అయినా 2 లేదా 3 రోజులు సమయం ఇస్తాడు. ఆ రోజుల్లోనే కంపెనీలు యాడ్స్ తీయడం, ఫొటోషూట్స్ చేయడం, ప్రెస్ మీట్లు పెట్టడం వంటి పనులు పూర్తి చేసుకోవాలి. ఇక ఆ సమయంలో రోజుకు కోహ్లి ఏకంగా రూ.2.50 కోట్ల వరకు వసూలు చేస్తాడు. అయితే ఇది గతంలో మాట. ఇప్పుడు మరీ అతని బ్రాండ్ వాల్యూ బాగా పెరిగింది. కనుకనే ఇప్పుడు ఏకంగా రోజుకు రూ.5 కోట్ల వరకు యాడ్స్ షూట్ చేయడానికి రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్.
అయితే ఇది సరే. కోహ్లికి సంబంధించిన మరో విషయం కూడా ఉంది. అదేమిటంటే… అతని ఇన్‌స్టాగ్రాం అకౌంట్ గురించి. అవును అదే. అందులో కోహ్లికి ప్రస్తుతం 274 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దీంతో అటు ఇన్‌స్టాగ్రాంలోనూ కోహ్లి డబ్బు సంపాదిస్తున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లి తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ఏదైనా బ్రాండ్ గురించిన పోస్ట్ పెట్టాలంటే ఏకంగా అందుకు రూ.3.2 కోట్ల వరకు తీసుకుంటాడట. కచ్చితంగా అంత మొత్తం చెల్లిస్తేనే ఏ కంపెనీకి చెందిన పోస్ట్‌ను అయినా తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పెడతాడట. ఇదీ… కోహ్లి సంపాదన..! ఏది ఏమైనా ఇది షాకింగ్‌గానే ఉంది కదా..!