Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home mythology

శివానుగ్ర‌హంతో మృత్యుంజ‌యుడిగా మారిన మార్కండేయ మ‌హర్షి క‌థ గురించి తెలుసా..?

Admin by Admin
June 26, 2025
in mythology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మృకండు మహర్షి భృగు సంతతికి చెందినవాడు. ఆయన భార్య మరుద్వతి. ఎన్నాళ్లయినా వాళ్లకు సంతానం కలగలేదు. సంతానం కోసం దంపతులిద్దరూ తీర్థయాత్రలు చేయసాగారు. కేదారక్షేత్రం దర్శించుకున్నప్పుడు మీకు పుత్రభాగ్యం కలుగుతుంది అని అశరీరవాణి వినిపించింది. మృకండుడు, మరుద్వతి తీర్థయాత్రలు ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. కొన్నాళ్లకు మరుద్వతికి పండంటి మగశిశువు కలిగాడు. మృకండు దంపతుల పుత్రోత్సాహానికి భంగం కలిగిస్తూ, ఈ బాలుడు అల్పాయుష్కుడు. పన్నెండేళ్లు మాత్రమే ఇతడి ఆయుష్షు qlr అశరీరవాణి వినిపించింది. ఈ మాటలకు వారు దుఃఖించినా, అంతా పరమశివుని లీల అని సరిపెట్టుకున్నారు.

పుత్రుడికి శాస్త్రోక్తంగా జాతకర్మ జరిపించి, మార్కండేయుడు అని నామకరణం చేశారు. దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్న మార్కండేయుడికి మృకండు మహర్షి ఉపనయనం చేసి, గురుకులానికి పంపాడు. పదకొండేళ్ల వయసు వచ్చేసరికి మార్కండేయుడు అన్ని విద్యలూ నేర్చుకున్నాడు. తిరిగి తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. బ్రహ్మతేజస్సుతో గురుకులవాసం నుంచి తిరిగి వచ్చిన మార్కండేయుణ్ణి చూసి మృకండుడు సంతోషించాడు. మరుద్వతి కొడుకును అక్కున చేర్చుకుని మురిసిపోయింది. అతడికి పదకొండేళ్లు నిండాయని ఇంకొక్క ఏడాదే గడువు ఉందనే సంగతి గుర్తుకొచ్చి ఆ దంపతులకు గుండెతరుక్కుపోయింది.

do you know about the story of markandeya maharshi

మృకండుడు గుండెచిక్కబట్టుకున్నా, మరుద్వతి కొడుకును పట్టుకుని వలవలా కన్నీరు కార్చసాగింది. ఈ దుఃఖానికి కారణమేమిటని తరచి తరచి అడిగినా మరుద్వతి బదులివ్వలేదు సరికదా, బిగ్గరగా రోదించసాగింది.చివరకు మృకండుడే చెప్పలేక చెప్పలేక అసలు సంగతిని కొడుకుతో చెప్పాడు. నాయనా! నీ ఆయువు ఇంకొక్క ఏడాది మాత్రమే ఉంది అన్నాడతడు. తండ్రి మాటకు మార్కండేయుడు ఏమాత్రం తొణకలేదు. తండ్రీ! అన్నింటికీ ఆ పరమశివుడే రక్ష. నేను ఆయన గురించి తపస్సు చేస్తాను. మృత్యుంజయుడినై తిరిగి వస్తాను. ఆశీర్వదించండి అంటూ తల్లిదండ్రుల దీవెనలు పొందాడు. మార్కండేయుడు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా, అక్కడకు నారదుడు వచ్చాడు. మార్కండేయుని సంకల్పం తెలుసుకుని, ప్రశంసించాడు. నాయనా! ఇక్కడి నుంచి గౌతమీ తీరానికి వెళ్లు. పంచాక్షరీ జపంతో శివుడిని అర్చించు. నీ సంకల్పం నెరవేరుతుంది అని ఆశీర్వదించాడు. మార్కండేయుడు గౌతమీ తీరానికి వెళ్లి, అక్కడొక సైకతలింగాన్ని ప్రతిష్ఠించి, శివుడి కోసం తపస్సు చేయసాగాడు. లోకసంచారం చేస్తూ, నారదుడు యముడి దగ్గరకు వెళ్లాడు. మృత్యువును జయించడానికి మార్కండేయుడనే మునిబాలకుడు శివుడి కోసం తపస్సు చేస్తున్నాడు. నీ బలాబలాలేమిటో తేలే సమయం వచ్చింది అని చెప్పి చల్లగా జారుకున్నాడు. మార్కండేయుడికి మృత్యుఘడియ రానేవచ్చింది. అతడి ప్రాణాలను తోడితెమ్మని యముడు తన దూతలను పంపాడు. శివలింగం నుంచి వెలువడే తేజస్సుకు కళ్లుచెదిరి అతణ్ణి సమీపించలేకపోయారు. చేసేదేమీ లేక వెనుదిరిగి, యముడికి జరిగినదంతా చెప్పారు.

ఇక యముడే స్వయంగా మహిషాన్ని అధిరోహించి బయలుదేరాడు. సైకతలింగాన్ని గట్టిగా వాటేసుకుని, దానిపైనే తల ఆన్చి నిద్రిస్తున్న మార్కండేయుణ్ణి చూశాడు. అతడి ప్రాణాలు తీయడానికి తన కాలపాశాన్ని మార్కండేయుడి కంఠం మీదకు విసిరాడు.అంతే! హుంకారం చేస్తూ, శివలింగం నుంచి సాక్షాత్తు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. మార్కండేయుడి మీదకు పాశాన్ని విసిరిన యముడి మీదకు తన త్రిశూలాన్ని ఎక్కుపెట్టాడు. రౌద్రాకారంలో కనిపించిన శివుడిని చూసి యముడు గజగజలాడాడు. హర హరా! రక్షించు అంటూ మోకరిల్లాడు. శివుడు యముణ్ణి క్షమించి, విడిచిపెట్టాడు. మార్కండేయుని తలపై నిమిరి లేవదీశాడు. వత్సా! నీకిక మృత్యుభయం లేదు. కల్పకల్పాంతరాల వరకు చిరంజీవిగా ఉంటావు అని వరమిచ్చాడు. శివానుగ్రహంతో చిరంజీవి అయిన మార్కండేయుడు కళకళలాడుతూ తల్లిదండ్రులను చేరుకున్నాడు.

Tags: markandeya maharshi
Previous Post

విరాట్ కోహ్లి ఒక్క రోజు యాడ్ చేస్తే ఎంత రెమ్యున‌రేషన్ తీసుకుంటాడో తెలుసా..?

Next Post

సుగ్రీవుడి భార్యను వాలి నిజంగా కోరుకున్నాడా?

Related Posts

పోష‌ణ‌

యుక్త వ‌య‌స్సులో ఉన్న బాలిక‌లు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవి..!

July 12, 2025
వైద్య విజ్ఞానం

బైపాస్ సర్జ‌రీ అంటే ఏమిటి..? ఏం చేస్తారు.. త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

July 12, 2025
హెల్త్ టిప్స్

రోజూ ట‌మాటాల‌ను తిన‌డం మ‌రిచిపోకండి.. ఎందుకంటే..?

July 12, 2025
lifestyle

అమెరికాలో ఉన్నటువంటి ఆఫ్రికన్ ప్రజలు ఆస్ట్రేలియాలో ఎందుకు లేరు?

July 12, 2025
lifestyle

హిట్ 3 లో చూపించిన‌ట్లు స‌మాజం అంత‌గా రాక్ష‌సానందం పొందుతుందా..?

July 12, 2025
mythology

శ్రీ‌కృష్ణదేవ‌రాయ‌లు స‌రిగ్గా అదే తేదీన చ‌నిపోయార‌ట‌..!

July 12, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.