Fish Bone : చేపలను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. చేపల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. చేపలను తరచూ తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా ఎన్నో లాభాలు కలుగుతాయి.
అయితే సాధారణంగా చేపల్లో ముళ్లు ఉంటాయి కనుక చాలా మంది వాటిని తినేందుకు జంకుతుంటారు. చేపలను తింటే ముళ్లు ఎక్కడ గొంతులో గుచ్చుకుంటాయోనని భయపడుతుంటారు. అందుకనే కొందరు చేపలు అంటే ఇష్టం ఉన్నప్పటికీ ముళ్ల భయంతో వాటిని తినరు.
ఇక చేపలను తిన్నప్పుడు వాటి ముళ్లు గొంతులో ఇరుక్కుంటే భయపడాల్సిన పనిలేదు. వాటిని సులభంగానే బయటకు తీయవచ్చు. చేపల ముళ్లు గొంతులో ఇరుక్కోకుండా నేరుగా జీర్ణాశయంలోకి వెళితే ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే జీర్ణాశయంలో ఉండే ఆమ్లాలు చేపల ముళ్లను సులభంగా కరిగించేస్తాయి. కనుక చేపల ముళ్లు పొట్ట లోపలికి వెళితే కంగారు పడాల్సిన పనిలేదు.
ఇక చేపల ముళ్లు గొంతులో చిక్కుకుంటే పొట్టమీద గట్టిగా ఒత్తాలి. దీంతో గాలితోపాటు ముళ్లు కూడా బయటకు వస్తాయి.
చేపల ముళ్లు గొంతులో ఇరుక్కుంటే వంగొని వీపు మీద ఒత్తిడి కలిగించాలి. ఈ సమయంలో నోటిని తెరిచి ఉంచాలి. దీంతో ముళ్లు బయటకు వస్తుంది.
చేప ముల్లు గొంతులో ఇరుక్కుపోతే వెంటనే పొడి అన్నంను తీసుకుని ముద్దలా చేసి నమలకుండా మింగేయాలి. తరువాత ఒక గ్లాస్ మంచినీళ్లను తాగాలి. దీంతో ముల్లు గొంతు నుంచి లోపలికి వెళ్లిపోతుంది.
చేప ముల్లు గొంతులో ఇరుక్కుపోతే అరటిపండును సగం తీసుకుని నోట్లో వేసుకుని నమలకుండానే మింగేయాలి. తరువాత కొద్దిగా నీళ్లను తాగాలి. దీంతో ముల్లు గొంతు నుంచి కిందకు పోతుంది.
చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే గుప్పెడు పల్లీలను తిని నీళ్లను తాగాలి. పల్లీలను నమిలి మింగి నీళ్లను తాగాల్సి ఉంటుంది. అలాగే బ్రౌన్ బ్రెడ్‌ను కూడా తినవచ్చు. దానికి రెండు వైపులా పీనట్ బటర్ రాసి తరువాత దాన్ని తినేయాలి. అనంతరం నీళ్లను తాగాలి. దీంతో ముల్లు లోపలికి వెళ్లిపోతుంది.
అలాగే ఒక గ్లాస్ నీటిలో రెండు టీస్పూన్ల వెనిగర్ కలిపి ఆ నీటిని రెండు టీస్పూన్ల మోతాదులో మాత్రమే తాగాలి. అలాగే కొందరు డాక్టర్లు చేప ముల్లు గొంతులో చిక్కుకుంటే కూల్ డ్రింక్స్ లేదా సోడా తాగమని చెబుతుంటారు.
చేప ముల్లు ఇరుక్కుపోయిన వెంటనే సోడాను తాగాలి. దీంతో సోడాలో ఉండే వాయువు గొంతులోని ముల్లుపై ఒత్తిడి తెస్తుంది. ఫలితంగా ముల్లు బయటకు వస్తుంది.
రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌ను నేరుగా అలాగే తాగేయాలి. ఇలా చేయడం వల్ల ముల్లు గొంతులోంచి జీర్ణాశయంలోకి వెళ్లిపోతుంది. దీంతో సమస్య తగ్గుతుంది.
చేప ముల్లు గొంతులో ఇరుక్కోగానే వెంట వెంటనే 4, 5 సార్లు దగ్గాలి. దీంతో ముల్లు బయటకు వచ్చేస్తుంది.
రెండు టీస్పూన్ల నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల కూడా చేప ముల్లు గొంతులో నుంచి బయటకు వస్తుంది.
అయితే చేపలను తినేటప్పుడు నెమ్మదిగా, జాగ్రత్తగా, కంగారు, ఆందోళన, భయం చెందకుండా తినాలి. దీంతో ముల్లు గొంతులో ఇరుక్కోకుండా జాగ్రత్త పడవచ్చు. చేప ముక్కలను వేరే ప్లేట్‌లో పెట్టుకుని తినాలి. అన్నం తినే ప్లేట్ కాకుండా వేరే ప్లేట్‌లో పెట్టుకుని తినడం వల్ల ముల్లు ఇరుక్కుపోకుండా ఉంటుంది. ఇక మార్కెట్‌లో ముల్లు చాలా తక్కువగా ఉండే చేపలు ఉంటాయి. వాటి ధర ఎక్కువగానే ఉంటుంది. చేపలను తినాలంటే ముల్లు కారణంగా భయపడేవారు అలాంటి ముళ్లు తక్కువగా ఉండే చేపలను కొని తెచ్చి వండి తింటే మంచిది. ఇక ఎంత ప్రయత్నించినా ముల్లు బయటకు రాకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. లేదంటే ప్రాణాల మీదకు రావచ్చు.