కాబుల్ నది ( దాని ఉపనది Chahar Asiab) మీద 300 మిలియన్ డాలర్ల వ్యయంతో భారత్ Shahtoot Dam నిర్మిస్తుంది. దాని నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. 2027 నాటికి అది పూర్తి అవుతుంది. అదికానీ పూర్తి అయితే పాకిస్తాన్ కి వచ్చే నీటిలో 16–17% శాతం నీరు తగ్గిపోతుంది అని మనం కాదు పాకిస్తానీ మీడియా అంటుంది. సారవంతమైన పెషావర్, Nowshera మొదలైన ప్రాంతాలకు ఈ నీరు చాలా అవసరం.
ఆఫ్ఘన్ కి ప్రయోజనం ఏమిటి? 4 నుంచి 10 వేల హెక్టార్లకి నీరు అందుతుంది. 20 లక్షల కాబుల్ వాసులకి త్రాగునీరు లభిస్తుంది, భూగర్భ జలాలు పెరుగుతాయి. మనతో పాకిస్తాన్ కి indus water treaty ఉన్నట్టు ఆఫ్గనిస్తాన్ తో ఒప్పందం లేదు. ఇన్నాళ్లు వాళ్ళకి dams లేవు కాబట్టి ఇబ్బంది రాలేదు.
ఇప్పుడు పాకిస్తాన్, కాబూల్ నదీ జలాల పంపకాలకై ఒప్పందం చేసుకుందామని మరింత ఒత్తిడి పెంచుతుంది ఆఫ్ఘన్ మీద. వారు ఏవిధమైన ఒప్పందం చేసుకునేది లేదు అని చెబుతున్నారు. భవిష్యత్తు లో కాబుల్ నది మీద 12 dams కట్టాలి అని ఆఫ్ఘన్ కోరిక.
Kunar నది నీళ్లు కూడా పాకిస్థాన్ కి అవసరం, ఆ నది మీద Dam కడతాం అని చైనాకి చెందిన సంస్థ 2024 లో ముందుకి వచ్చింది. కొన్ని సంవత్సరాలు క్రితం ఆఫ్గనిస్తాన్ లో భారత, చైనా కలిసి పనిచేయాలి అన్న ప్రతిపాదనలు చర్చించారు. తరువాత అవి ముందుకి వెళ్ళ లేదు. ఈ సారి, ఒకటి లేదా రెండు రఫెల్ యుద్ధ విమానాలు కొనడానికి పెట్టే ఖర్చు భారత్ ఆ dam నిర్మాణానికి పెడితే ఇది పూర్తి అయిపోతుంది. పాకిస్తాన్ ఈ dam నిర్మాణానికి అభ్యంతరాలు ఏమైనా చెబితే, చైనాతో మాట్లాడుకోమంటే సరిపోతుంది.