స్త్రీలు తమ నెలసరి సమయంలో ఆరోగ్యకరమైన డైట్ ను తీసుకోవడం హెల్త్ కి చాలా మంచిది. రుతుచక్రం ఉన్న రోజుల్లో హార్మోన్లలో అనేక మార్పుల కారణంగా శరీరాన్ని అనేక రకాలుగా అసౌకర్యానికి గురిచేస్తాయి. ముఖ్యంగా ఆ సమయంలో తీవ్ర రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే నెలసరి రోజుల్లో మహిళలు మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం చాలా ఉత్తమం. పండ్లని తమ డైట్‌లో చేర్చుకోవడం వల్ల శరీరంలోని సహజమైన శక్తిని ఇస్తాయి. అయితే నెలసరి సమయంలో ఏఏ పండ్లు తింటే మేలు కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పీరియడ్స్ టైమ్ లో స్త్రీలకు అరటి పండ్లు మంచి డైట్ అని చెప్పవచ్చు. ఇందులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ పండ్లలో విటమిన్ B-6 ఉండడం వల్ల నెలసరి సమయంలో ఉండే చిరాకులను తగ్గించే అవకాశం ఉంది. అరటి పండ్లలో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల శరీరంలో సహజశక్తిని ప్రేరేపిస్తుంది. అలసట, నిస్సత్తువని దూరం చేస్తుంది.
బెర్రీ పండ్లలో రకాలైన స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ లాంటివి యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. శరీరంలో వాపుని నివారించడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతోంది. బెర్రీ ఫ్రూట్స్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల మీ జీర్ణ శక్తి మొరుగు అవుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. నోటికి రుచిగా ఉండే ఈ బెర్రీలు ఆకలిని కూడా అదుపులో ఉంచుతుంది. నారింజతో పాటు ఇతర పుల్లని పండ్లలో విటమిన్ – సి ఉంటుంది. ఈ విటమిన్ వల్ల శరీరం ఇనుము శోషణ చేసుకోవడానికి సహకరిస్తుంది. సాధారణంగా మహిళల పీరియడ్స్ సమయంలో శరీరంలోని ఐరెన్ స్థాయి పడిపోయే అవకాశం ఉంది. దాని వల్ల అలసట, బలహీనత వస్తుంది. ఈ క్రమంలో పుల్లని పండ్లతో పాటు ఆకు కూరలు, చిక్కుళ్లు వంటి ఆరోగ్య పదార్థాలను తీసుకోవడం మంచిది.
పైనాపిల్లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది ఉబ్బరాన్ని తగ్గించడం సహా జీర్ణక్రియని మెరుగు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల కండరాల ఒత్తిడి తగ్గుతుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది. కివీ ఫ్రూట్స్ లో విటమిన్ – కే, విటమిన్ -ఈ, ఫోలేట్ లాంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ పండు తినడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగయ్యే అవకాశం ఉంది. రుతుక్రమంలో ఈ పండ్లు తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. నెలసరి సమయంలో స్త్రీలు తమ డైట్ లో ఈ పండ్లను చేర్చుకోవడం వల్ల చికాకు, అసలట, బలహీనత వంటి వాటిని తగ్గించుకోవచ్చు. అరటి పండు ఉబ్బరాన్ని తగ్గించడంతో పాటు పైనాపిల్ నొప్పులని తగ్గించే అవకాశం ఉంది. రుతుక్రమంలో నీళ్లు బాగా తాగాలి. తేలికపాటి వ్యాయామాలు చేసి.. మంచి ఆహారాన్ని తీసుకోవాలి. పోషకాలు అధికంగా ఉండే ఆహారంతో పాటు పండ్లు కూడా తినాలి.