యుక్తవయసులో బాలికలు పోషకాహారం బాగా తినాలి. ఈ వయసులో తినే ఆహారం వారిని జీవితాంతం ఆరోగ్యంతో వుంచుతుంది. యుక్తవయసు అంటే శరీరం సంతానోత్పత్తికి సిద్ధం కాగల సమయం అని గుర్తించాలి. శరీరంలో హార్మోన్ల మార్పులు వస్తాయి. సాధారణంగా బాలికలు 10 నుండి 15 సంవత్సరాల మధ్య యుక్తవయసు పొందుతారు. ఈ వయసులో వారికి అధికంగా తినాల్సిన పోషకాహారాలు పరిశీలించండి. కాల్షియం – భవిష్యత్ జీవితంలో వీరికి ఎముకల అరుగుదల సమస్య రాకూడదనుకుంటే, యుక్తవయసులో కాల్షియం సంబంధిత ఆహారాలు బాగా తినాలి. తక్కువ కొవ్వు వుండే పెరుగు, పాలు, జున్ను వంటివి, ఇతర కాల్షియం అధికంగాగల తిండ్లు తినాలి.
ఐరన్ – యుక్తవయసులో బాలికలకు ఇది చాలా ప్రధానం. పిరీయడ్ లో వీరికి చాలా రక్తం పోతుంది అందుకుగాను ఐరన్ అధికంగా వుండే ఆహారాలు, గింజధాన్యలు, చేపలు, బీన్స్, మాంసం తినాలి. అయితే, బాలికలు ఈ సమయంలో తాము తినే తిండికి హార్మోన్లు పెరుగుతాయి కనుక, బరువు ఎక్కకుండా చూసుకోవాలి. ప్రొటీన్లు – ప్రొటీన్లు కండరాలు, ఇతర కణజాలాన్ని నిర్మిస్తాయి. రోజువారీ చర్యలకు వారు శక్తి కలిగి చురుకుగా వుండాలంటేప్రొటీన్ అధికంగా వుండే ఆహారాలు, చేపలు, మాంసం, కోడి సంబంధిత ఉత్పత్తులు బాగా తినాలి.
కొవ్వులు – యుక్తవయసులో కొవ్వులు కూడా కొంతవరకు తీసుకోవాలి. అది ఎదుగుదల, శక్తి ఇస్తాయి. తగిన మొత్తాలలోసాల్మన్ చేపలు, కాయలు, పండ్లు, ఆలివ్ ఆయిల్ వంటివి తీసుకొని ఎనర్జీ పొందాలి.
బరువు – యుక్తవయసు హార్మోన్లు స్తనాలు, తొడలు, పిరుదుల భాగాలలో కొవ్వు పేరుకునేట్లు చేస్తుంది. బరువు తగ్గాలనే వెర్రితో బాగా సన్నబడి, రక్తహీనత ఏర్పడకుండా చూడాలి. సరైన తిండ్లు తినడం, తగిన వ్యాయామం చేయడం. తగిన నీరు తాగడం వంటివి ఈ దశలో బాలికలకు ఎంతో అవసరం.