Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామిని తొలుత ఎవ‌రు ద‌ర్శించుకుంటారో తెలుసా..?

Admin by Admin
July 12, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

తిరుమలలో శ్రీవారి దర్శనమంటే ఎవరికైనా చాలా ఆసక్తి ఉంటుంది. మరి తొలి దర్శనం చేసుకునే భాగ్యం ఎవరికి కలుగుతుంది. అది ఒకటి, రెండు సార్లు కాదు. జీవితాంతం వారే తొలిదర్శనం చేసుకుంటారు. వారే ఎందుకు తొలి దర్శనం చేసుకుంటారు. ఎవరు వారు ఆ చరిత్ర ఏమిటి? సూర్యోత్పూర్వానికి ముందే పూజారులు శుభ్రంగా నదీస్నానం చేసి ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి నమస్కరించి ఆలయాన్ని తెరుస్తారు. అంటే పూజారులే తొలి దర్శనం చేసుకుంటారు. ఇది సాధారణ ఆలయాల్లో… మరి తిరుమలలో ఏం జరుగుతుంది. వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఎలా ఉంటుంది. శ్రీవారి ఆలయానికి పెద్ద వ్యవస్థ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానమే ఉంది. అయితే ఎవరు తలుపులు తెరుస్తారు.? తొలిదర్శనం ఎవరు చేసుకుంటారు. ప్రతీ రోజూ ఒకే ఒకాయన తలుపు తెరుస్తారు. ఆయనే తొలిదర్శనం చేసుకుంటారు.

ఎవరాయన అంటే సన్నిధి గొల్ల వారే తొలి దర్శనం చేసుకుంటారు. ఎందుకలా..? అంటే మనం చరిత్రలోకి తొంగి చూడాల్సిందే. ఎప్పటి నుంచో స్వామి వారికి ఓ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ప్రకారం స్వామి పరకామణిని కొందరు చూస్తే.. ఆలయాన్ని కొందరు చూసేవారు. పూజాధి కార్యక్రమాలు అర్చకులు చేస్తారు. ఇందులో భాగంగా స్వామి వారి ఆలయ భద్రత వంటి వాటిని గొల్లలు చూసేవారు. ఉదయం ఆలయం తెరచి రాత్రి మళ్ళీ మూసుకుని వెళ్ళేవారు. తిరిగి వారే ఆలయాన్ని తెరుస్తారు. ఆ బాధ్యతను నేటికి వారే నిర్వహిస్తున్నారు. అందుకే వీరిని సన్నిధి గొల్ల అంటారు. సాంప్రదాయబద్ధంగా ఆ కుటుంబమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆనవాయితీగా ప్రతిరోజు తెల్లవారుజామున సన్నిధి గొల్ల శుచిగా స్నానం చేసి దివిటీ చేపట్టుకుని 3 గంటల సమయంలో కుంచెకోల(తాళాలు ఉండేది) తీసుకుని ఆలయానికి బయలుదేరుతారు. అంతకు మునుపు అర్చకులు ఆయన ఇంటి వెళ్ళి ఆయనను ఆలయం తెరవడానికి ఆహ్వానిస్తారు.

do you know first who visits venkateshwara swamy

అందరు కలసి ఆలయం వద్దకు వెళ్ళతారు. అందరూ బయట నిలబడి ఉండగా గొల్లసన్నిధి తాళాలతో తలుపులు తెరుస్తారు. అనంతరం బంగారు వాకిలి వద్దకు వెళ్ళి జీయంగార్ స్వాములు వేదపండితులు సుప్రభాతం పఠనం మొదలు పెడుతుండగా సన్నిధి గొల్ల ఆ తలుపులు తెరుస్తారు. దీంతో ఆయనకు వేంకటేశ్వర స్వామి తొలిదర్శనం లభిస్తుంది. ఆ తరువాత అర్చకులు తమతో తెచ్చుకున్న పూజా సామాగ్రితో లోనికి ప్రవేశించి రాత్రి పవళింప చేసిన భోగశ్రీనివాస మూర్తి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకెళ్ళతారు. తరువాత అన్ని రకాల కైంకర్యాలు జరుగుతాయి. ఇలా తొలిదర్శనం సన్నిధి గొల్లకు దక్కుతుంది. తిరిగి రాత్రి తుది దర్శనాన్ని చేసుకుని తలుపులు వేసి సన్నిధి గొల్ల తాళాలను తను నివాసం ఉంటున్న ఇంటికి తీసుకెళ్ళతారు.

Tags: venkateshwara swamy
Previous Post

పితృ ప‌క్షాలు అంటే ఏమిటి..? వాటి వ‌ల్ల ఉప‌యోగాలు ఏమిటి..?

Next Post

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యానికి చెందిన ఈ 10 ర‌హ‌స్యాలు మీకు తెలుసా..?

Related Posts

ఆధ్యాత్మికం

కుంకుమ లేదా బొట్టును నుదుట‌నే ఎందుకు పెట్టుకుంటారు..?

July 12, 2025
ఆధ్యాత్మికం

శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి సుప్ర‌భాతంలో రామ అనే పదం ఎందుకు ఉంటుంది..?

July 12, 2025
lifestyle

పెద్ద‌ల కాళ్ల‌కు న‌మ‌స్కారం ఎందుకు చేస్తారు..? దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటి..?

July 12, 2025
వైద్య విజ్ఞానం

బొల్లి వ్యాధి వంశ‌పారంప‌ర్యంగా వ‌స్తుందా..? నిపుణులు ఏమంటున్నారు..?

July 12, 2025
హెల్త్ టిప్స్

వీటిని రోజూ తీసుకోండి.. మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి..!

July 12, 2025
వైద్య విజ్ఞానం

మీ దంతాలు ప‌సుపు రంగులోకి మారాయా..? అయితే అందుకు కార‌ణాలు ఇవే..!

July 12, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.