అన్నమయ్య, శ్రీరామదాసు వంటి భక్తిరస చిత్రాలతో భక్తుడిగా ప్రేక్షకులలో స్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు నాగార్జున. అయితే అన్నమయ్య చిత్రంలో తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుడిగా అన్నమయ్య పాత్రలో నాగార్జున జీవించేసారనే చెప్పవచ్చు. 1997 లో రిలీజ్ అయిన అన్నమయ్య ఆంధ్ర రాష్ట్రాన్ని భక్తి భావంతో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ కూడా చాలా అద్భుతమైన నటనను కనబరిచారు.
అయితే ఈ పాత్రకు ముందుగా సుమన్ చేయాల్సింది కాదట. అప్పటికే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున, వెంకటేశ్వర స్వామి భక్తునిగా చాలా మట్టుకు సన్నివేశాలు ఆయన కాళ్ళ మీద పడే సన్నివేశాలు ఉన్నాయి. దాని వలన వెంకటేశ్వర స్వామి పాత్రకు గాను ఒక సీనియర్ స్టార్ హీరో అయితే బాగుంటుందని రాఘవేంద్రరావు ముందుగా నటభూషణ శోభన్ బాబును సంప్రదించారట. కానీ ఆయన ఆ పాత్రను వదులుకోలేక రూ. 50 లక్షలు పెద్ద మొత్తంలో అడగడంతో ఆయన్ని పక్కన పెట్టి, ఆ పాత్రకు కాను బాలకృష్ణను సంప్రదించారట. ఇద్దరు స్టార్ హీరోలు అలాంటి పాత్రలలో కనిపిస్తే అభిమానులు సినిమాను ఎలా ఆదరిస్తారో అని భయంతో దర్శకరత్న రాఘవేంద్రరావు వెనక్కి తగ్గారట.
ఇక తర్వాత సుమన్ అయితే ఈ క్యారెక్టర్ కి బాగుంటుందని భావించి సుమన్ ని పిలిపించి కథ వినిపించడం జరిగిందట. సుమన్ కి కథ నచ్చడంతో ఆ తర్వాత ఫోటోషూట్ కూడా నిర్వహించి సుమన్ ఈ పాత్రకు పర్ఫెక్ట్ అని భావించి, ఆయనను ఫిక్స్ చేశారట రాఘవేంద్రరావు. అలా సుమన్ కూడా అన్నమయ్య చిత్రం సక్సెస్ అవడంలో తన వంతు పాత్ర పోషించారు.