Prabhas : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు హీరో ప్రభాస్. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకు పోతున్నాడు. ప్రతీ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సెట్ చేసుకుంటూ ఇండియా టాప్ హీరోల సరసన నిలవాలని చూస్తున్నాడు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వరుస పాన్ ఇండియా సినిమాలకు ఓకే చెబుతూ హల్‌చల్ సృష్టిస్తున్నాడు.
ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా.. బాలీవుడ్ లో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ వంటి పెద్ద ప్రాజెక్టులతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు డార్లింగ్ ప్రభాస్.
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్‌లో ఆదిపురుష్ సినిమా చిత్రీకరణ శేరవేగంగా జరుపుకుంటూ ఉండగా… మరోవైపు ప్రాజెక్ట్ కె సినిమా కోసం ప్రభాస్, దీపికా పదుకొణెతో షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా ప్రభాస్ కి సంబంధించి మరొక తాజా అప్డేట్ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది.

Prabhas : హారర్ కామెడీ చిత్రంలో ప్రభాస్:
డైరెక్టర్ మారుతి ఓ కథను డార్లింగ్‌కు వినిపించగా అందుకు ప్రభాస్ ఓకే అన్నాడని తెలుస్తోంది. ఈ సినిమా హారర్ కామెడీ జోనర్ లో ఈ సినిమా రూపొందనుందని టాక్. ఇక ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్‌ను కూడా రిజిస్టర్ చేయించారని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమాను దానయ్య నిర్మిస్తున్నారట. ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కూడా ఒక కొత్త చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రభాస్ ఆలోచిస్తున్నట్లు టాలీవుడ్ టాక్. అయితే వీటిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.