Health : ఆరోగ్యంగా ఉండాలి అంటే మానవ శరీరానికి ఎన్నో ప్రొటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు ఇలాంటి ఎన్నో రకాల పోషకాలు కావాలి. అన్ని పోషకాలూ ఒకే దాంట్లో దొరకవు కనుక ఒక్కో దానికి ఒక్కో పదార్థం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల పదార్థాలను రోజువారీ అవసరాలకు సరిపడా తినడం ద్వారా పోషకాలను శరీరానికి అందించొచ్చు. అయితే వాటిని తీసుకునే సమయం సరైనది అయి ఉండాలి. ముఖ్యంగా ఏ ఏ ఆహార పదార్థాలను అల్పాహారంలో తీసుకోవచ్చో.. లేదో కూడా తెలిసి ఉండాలి. ఒక్కోసారి కొన్ని పదార్థాలను సమయం కానీ సమయంలో తీసుకుంటే అనారోగ్య సమస్యలు సంభవిస్తాయని వైద్యులు అంటున్నారు. ఖాళీ కడుపున పలు పదార్దాలను అస్సలు తినవద్దని వారు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుత కాలంలో అనేక మంది పండ్ల రసాలను ఆహారంగా తీసుకుంటున్నారు. డైట్ అని కేవలం జ్యూస్ లను మాత్రమే సేవించే వారు కూడా ఉన్నారు. శరీరానికి అవసరమైన పోషకాలు పండ్లలో ఉన్నందున తాజా పండ్ల రసం తాగడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అయితే అసలు సమస్య ఆయా జ్యూస్ లను ఉదయం ఖాళీ కడుపున తీసుకోవడమే.అవును ఉదయాన్నే ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడం శరీరానికి హానికరమని వైద్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఈ కింద పేర్కొన్న పండ్ల రసాలను ఉదయం పరిగడుపున తాగకూడదని అంటున్నారు. మీరు వాటిని ఖాళీ కడుపున సేవిస్తున్నారా.. ఓసారి చెక్ చేసుకోండి.
సిట్రస్ జాతి పండ్ల రసాలు : సిట్రస్ జాతికి చెందిన పండ్ల రసాల్లో విటమిన్ సి ఉంటుంది. శరీరానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే పలు నివేదికల ప్రకారం ఖాళీ కడుపున సిట్రస్ జాతికి చెందిన పండ్ల రసం తాగడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. ఖాళీ కడుపుతో నారింజ, ద్రాక్షపండు లేదా నిమ్మరసం తాగడం వల్ల సమస్యలు వస్తాయట. ఉదయాన్నే వీటిని తీసుకోవటం వల్ల ఎసిడిటీకి గురయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు
ఉదయాన్నే చల్లటి జ్యూస్ : ఉదయం లేచి లేవగానే ఖాళీ కడుపుతో చల్లని జ్యూస్ తాగడం ఆరోగ్యానికి హానికరమని అంటున్నారు. పరిగడుపున చల్లని జ్యూస్ లు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుందని అంటున్నారు. చల్లటి జ్యూస్ కు బదులు వెచ్చటి జ్యూస్ లను తీసుకుంటే కొంత మేలు జరుగుతుందని అంటున్నారు. దాంతో పాటు ముఖ్యంగా ఆహారం తిన్న తర్వాత పండ్ల రసాలను సేవిస్తే మంచిదని అంటున్నారు.