Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home mythology

ఆయుష్షు పెంచుకోవాలంటే ఏం చేయాలి.? : గ‌రుడ పురాణంలో చెప్పిన సూచ‌న‌లు.!

Admin by Admin
April 8, 2025
in mythology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

భూమిపై పుట్టిన ప్రతి ఒక్క జీవి ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాల్సిందే. కాకపోతే ఒక జీవి ముందు, ఒక జీవి తరువాత చనిపోతుంది. అందుకు మనిషి కూడా అతీతుడు కాదు. మనిషైనా ఏదో ఒక రోజున ఎలాగోలా చనిపోవాల్సిందే. దాన్ని ఎవరూ ఆపలేరు. కానీ.. మనిషి జీవిత కాలాన్ని మాత్రం నిజంగా ఆపవచ్చు. అంటే.. చావు నుంచి తప్పించుకోవడం అని కాదు. కానీ చావును కొంత ఆలస్యంగా వచ్చేలా చేయడం అన్నమాట. అంటే.. కొంత ఎక్కువ కాలం జీవించడం అని మనం తెలుసుకోవాలి. మరి అలా ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలి ? అంటే.. ఇందుకు మీ వద్ద సమాధానం ఉండకపోవచ్చు. కానీ గరుడ పురాణం మాత్రం అందుకు సమాధానాలు చెబుతోంది. మరి ఆ సమాధానాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

గరుడ పురాణంలో ఏముంటుందో మనందరికీ తెలిసిందే కదా. మనిషి తన జీవిత కాలంలో చేసే ఆయా పనులకు నరకంలో ఎలాంటి శిక్షలు పడతాయో అందులో క్లియర్‌గా రాసి ఉంటుంది. అయితే కేవలం ఇదే విషయం మాత్రమే కాకుండా మనిషి జీవిత కాలం పెరగాలంటే ఏం చేయాలో కూడా అందులో రాసి ఉంది. మరి మన జీవిత కాలాన్ని పెంచుకునేందుకు గరుడ పురాణం ప్రకారం ఎలాంటి సూచనలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి పూట భోజనంలో ఎవరూ కూడా పెరుగు తినరాదు. ఎందుకంటే ఇది ఆ సమయంలో సరిగ్గా జీర్ణం కాదట. దీంతో అనారోగ్య సమస్యలు వచ్చి జీవిత కాలం , ఆయుర్దాయం తగ్గిపోతుందట. కనుక రాత్రి పూట పెరుగు తినరాదు.

what to do to increase life span according to garuda puranam

రాత్రి పూట చాలా మంది డిన్నర్‌ చేయగానే వెంటనే నిద్రపోతారు. కానీ అలా చేయరాదట. తిన్న వెంటనే నిద్రిస్తే అనారోగ్యాలు కలిగి జీవిత కాలం తగ్గుతుందట. కాబట్టి తిన్న వెంటనే నిద్రపోరాదు. రాత్రి పూట మాంసాహారం తినరాదు. తింటే అది సరిగ్గా జీర్ణం కాక అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. దీంతో అనారోగ్యం కారణంగా మనిషి ఆయుర్దాయం తగ్గుతుంది. త్వరగా చనిపోతాడు. కనుక రాత్రి పూట మాంసాహారం మానేస్తే జీవిత కాలాన్ని, ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చు. కొందరు ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తారు. అలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చి అవి జీవిత కాలాన్ని తగ్గిస్తాయట. కనుక ఎవరైనా ఉదయాన్నే త్వరగా నిద్రలేవాలి. ఆలస్యం చేయకూడదు. ఇక ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల ఆ సమయంలో వచ్చే గాలిని పీల్చుకుంటే అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయట.

శ్మశానాల్లో దహన కార్యక్రమాలను నిర్వహించగానే వెంటనే ఇంటికి చేరుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉండే బాక్టీరియాలు మన శరీరాల్లోకి వెళితే అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. వాటి వల్ల మనం త్వరగా చనిపోవాల్సి వస్తుంది. దీంతో జీవిత కాలం తగ్గుతుంది. కనుక ఎవరైనా ఎక్కువ కాలం జీవించాలంటే.. శ్మశానాల్లో దహన కార్యక్రమాలు ముగియగానే వెంటనే ఇంటికి చేరుకోవాలి. అక్కడే వెయిట్‌ చేయరాదు. ఇక చివరిగా గరుడ పురాణం ప్రకారం.. భార్యాభర్త ఎవరైనా రాత్రి పూటే శృంగారంలో పాల్గొనాలట. ఉదయం చేయకూడదట. చేస్తే ఆయుష్షు తగ్గుతుందని, ఆ సమయంలో మనిషి శరీర రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందని, అలాంటి సమయంలో శృంగారంలో పాల్గొంటే వచ్చే అనారోగ్య సమస్యలు మనిషి ఆయుర్దాయాన్ని తగ్గిస్తాయని గరుడ పురాణం చెబుతోంది. కనుక దంపతులు రాత్రి పూటే శృంగారంలో పాల్గొంటే మంచిది. ఆయుష్షు పెరుగుతుంది.

Tags: garuda puranam
Previous Post

నీరు ఎప్ప‌టికీ పాడ‌వ‌దు క‌దా.. మ‌రి వాట‌ర్ బాటిల్స్‌కు ఎందుకు ఎక్స్‌పైరీ ఉంటుంది..?

Next Post

పార్లే-జీ లో జి అంటే ఏమిటి..? ప్యాకెట్ మీద ఉన్న చిన్నారి ఎవరు? క్లారిటీ ఇచ్చిన కంపెనీ..!!

Related Posts

వినోదం

స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

June 1, 2025
information

ఎస్‌బీఐ లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

June 1, 2025
చిట్కాలు

ఈ చిట్కాల‌ను రోజూ పాటిస్తే మీ జుట్టుకు ఎలాంటి ఢోకా ఉండ‌దు..!

June 1, 2025
హెల్త్ టిప్స్

ఫ్రిజ్ లో ఈ వ‌స్తువుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ పెట్ట‌కూడ‌దు..

June 1, 2025
ఆధ్యాత్మికం

మంచం మీద కూర్చుని తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!