Sameer : బుల్లితెరతోపాటు వెండితెరపై కూడా పలు పాత్రల్లో నటించి సమీర్ ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆయన నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. అయితే తన కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలను చూసిన సమీర్ కొన్ని చేదు విషయాలను పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలిపారు.
ఈటీవీలో సీరియల్స్ చేస్తున్న సమయంలో కొందరు నాపై దుష్ప్రచారం చేశారు. నాకు ఓ నటితో ఎఫైర్ అంటగట్టారు. ఆ విషయం తెలిసి సుమన్ నన్ను వెంటనే తొలగించారు. కనీసం సంజాయిషీ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. తరువాత అసలు విషయం తెలిసి ఆయన నాకు ఫోన్ చేశారు. కానీ అప్పటికే తీవ్రమైన నష్టం జరిగింది. నా జీవితంలో ఎన్నడూ లేని ఇబ్బందులు పడ్డాను. చేతిలో చిల్లిగవ్వ లేదు. వచ్చే పేమెంట్స్‌ను ఆపేశారు. తరువాత ఎలాగోలా నిలదొక్కుకున్నా.. అని సమీర్ తెలిపారు.
ఇక పవన్ కల్యాణ్ కొమరం పులి షూటింగ్ సమయంలో తాను ఓ కథ రాస్తే దాన్ని న్యూస్‌లో నుంచి నాగబాబు తీయించారని, ఆ విషయంలో ఆయన తనను తిట్టారని.. అయితే పవన్ కల్యాణ్ ఫోన్ చేసి సముదాయించారని తెలిపారు. ఇక ఆరెంజ్ సినిమా విడుదల సమయంలోనూ తనకు, నాగబాబుకు మధ్య అపార్థాలు వచ్చాయని, కానీ కొంత కాలానికి అంతా సద్దుమణిగిందని, ఇప్పుడు తాము ఫ్రీగానే కలసి మాట్లాడుకుంటున్నామని.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. సమీర్ స్పష్టం చేశారు.