Jobs : హెడ్ కానిస్టేబుల్ జీడీ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను ది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా 249 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు ప్రక్రియ డిసెంబర్ 20, 2021న ప్రారంభమైంది. దరఖాస్తులను సమర్పించేందుకు మార్చి 31, 2022వ తేదీ వరకు గడువు విధించారు.
ఈ ప్రక్రియలో భాగంగా పురుషుల విభాగంలో 181, మహిళల విభాగంలో 68 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి 12 తరగతి చదివి ఉండడంతోపాటు రాష్ట్ర లేదా జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో ఏవైనా ఆటల్లో పాల్గొని ఉండాలి. ఆగస్టు 1, 2021వ తేదీ నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు అర్హులు.
జనరల్ కేటగిరి అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజును చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. సెప్టెంబర్ 1, 2019 నుంచి మార్చి 31, 2022 మధ్య స్పోర్ట్స్ టోర్నమెంట్‌లలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు ప్రాధాన్యతను ఇస్తారు. ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులకు దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు. మరిన్ని వివరాల కోసం cisf.gov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.