Shaakuntalam : గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం.. శాకుంతలం. ఈ సినిమాలో సమంత ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కొంత సేపటి క్రితమే లాంచ్ చేశారు. ఇందులో సమంత ఆకట్టుకుంటోంది. మైథలాజికల్ ఫాంటసీ జోనర్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ క్రమంలోనే సమంత ఇందులో నటిస్తుండడంతో ఈ మూవీపై అంచనాలు ఇంకా పెరిగాయి.
శాకుంతలం సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేయనున్నారు. మొత్తం 5 భాషల్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. గతేడాది చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అందులో భాగంగానే సినిమాకు ముఖ్యంగా కావల్సిన గ్రాఫిక్స్‌ను ప్రస్తుతం తీర్చిదిద్దుతున్నారు.
ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక సమంత ఈ మూవీలో శకుంతల పాత్రలో నటించింది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతల అనే నాటకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మహాభారతంలో ఇదొక చిన్న కథ. అయితే ఇందులో శకుంతలగా సమంత ఫస్ట్ లుక్ అదిరిపోయిందనే చెప్పవచ్చు. అలాగే చిత్రంలో అదిరిపోయే స్థాయిలో గ్రాఫిక్స్ ఉంటాయని అర్థమవుతోంది.