Sugarcane Juice : చెరుకు రసం అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది. వేసవి కాలంలో మనకు రహదారుల పక్కన ఎక్కడ చూసినా చెరుకు రసం తీసి అమ్మే విక్రయదారులు కనిపిస్తుంటారు. మండే వేసవిలో చల్ల చల్లని చెరుకు రసం తాగితే వచ్చే మజాయే వేరు. అయితే చెరుకు రసాన్ని తయారు చేసిన వెంటనే తాగాల్సి ఉంటుంది. ఆలస్యం అస్సలు చేయరాదు. దీని వెనుక ఉన్న కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చెరుకు రసాన్ని తయారు చేసిన తరువాత 4 గంటల లోపు తాగేయాలి. ఎందుకంటే ఎక్కువ సేపు ఉంటే ఆ రసం గోధుమ రంగులోకి మారుతుంది. ఆ రసంలో ఉండే సమ్మేళనాల వల్లే ఇలా జరుగుతుంది. సమయం గడిచిన కొద్దీ చెరుకు రసం పులుస్తూ గోధుమ రంగులోకి మారుతుంటుంది. కనుక చెరుకు రసాన్ని తయారు చేసిన వెంటనే తాగేయాలి. ఆలస్యం అస్సలు చేయరాదు.
చెరుకు రసాన్ని ఎక్కువ సేపు ఉంచిన తరువాత దాన్ని తాగితే మనకు అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక దాన్ని తయారు చేసిన వెంటనే తాగాల్సి ఉంటుంది. అయితే ఇంట్లో తయారు చేసుకున్న స్వచ్ఛమైన చెరుకు రసం అయితే ఫ్రిజ్‌లో పెడితే 2 నుంచి 3 వారాల వరకు ఉంటుంది. అదే బయట ప్యాక్‌లలో అమ్మేవి అయితే 60 రోజుల వరకు నిల్వ ఉంటాయి. అది కూడా వాటిలో ప్రిజర్వేటివ్స్ కలపాల్సి ఉంటుంది. వాటిని 10 నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచాలి. అలా ఉంచితేనే చెరుకు రసం పాడవకుండా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది.