Bandla Ganesh : పవన్ కల్యాణ్, రానాలు ప్రధాన పాత్రల్లో తాజాగా నటించిన చిత్రం.. భీమ్లా నాయక్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకోని కారణాల వల్ల రద్దయింది. అయితే పవన్‌కు వీరాభిమాని అయిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఈ ఈవెంట్‌కు రావాలని కోరుతూ ఓ అభిమాని కాల్ చేశాడని.. కానీ తనను ఈ ఈవెంట్‌కు పిలవలేదని.. త్రివిక్రమ్ తనను ఈ ఈవెంట్‌కు రాకుండా అడ్డుకుంటున్నారని.. ఆరోపిస్తూ.. బండ్ల గణేష్ మాట్లాడినట్లు ఓ ఫోన్ కాల్ ఆడియో తెగ దుమారం రేపింది. ఈ ఆడియో వైరల్ కూడా అయింది. అయితే ఆ ఆడియోపై బండ్ల గణేష్ స్పందించారు.
ఆ ఆడియోలో ఉన్నది తన గొంతు కాదని.. తాను అస్సలు ఎన్నడూ అలా మాట్లాడబోనని.. ఎవరో కావాలని తన గొంతుతో మిమిక్రీ చేశారని.. బండ్ల గణేష్ కొట్టి పారేశారు. అంతేకానీ.. అసలు ఆ ఆడియోలో ఉన్నది తన గొంతు కాదని ఆయన స్పష్టం చేశారు. ఎవరో మాట్లాడిన దాన్ని తన వాయిస్‌గా రికార్డు చేశారని అన్నారు.
కాగా భీమ్లా నాయక్ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ కాగా.. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మళయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్‌గా భీమ్లానాయక్‌ను నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.