business

ఆటోమేటిక్ కార్లు, మాన్యువల్ గేర్లు ఉన్న కార్లు – రెండిటిలో ఏవి ఎక్కువ మైలేజీ ఇస్తాయి? ఎందుకు?

<p style&equals;"text-align&colon; justify&semi;">నేను 2005లో ఆటోమేటిక్ గేర్ల మారుతి జెన్ కొన్నాను&period; ఆ కారు ప్రతి 9 కిలోమీటర్లకు లీటరు పెట్రోలు గుటకేసేది&period; విలన్ హోండాలా&period; అప్పట్లో ఆటోమేటిక్ గేర్ల సాంకేతికత లభ్యత మన దేశంలో తక్కువ&period; దశాబ్దం క్రితం వరకు ఆటోమేటిక్ గేర్లున్న కార్ల మైలేజ్ మాన్యువల్ గేర్ల కార్లతో పోలిస్తే దాదాపు సగం వరకు తక్కువ ఉండేది&period; అలా ఎందుకో సాంకేతికత జోలికి పోకుండా అతిసరళంగా చెప్పే ప్రయత్నం చేస్తాను&period; బండి ముందుకు కదలాలంటే గేరు మార్చాలి&period; వేగం పెరిగే కొద్దీ పై గేరు వెయ్యటం వల్ల ఇంజను ఎక్కువ RPM వద్ద ఇంధనాన్ని సమర్థవంతంగా కాల్చి ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసి చక్రాలకు పంపగలదు&period; వేగం తగ్గే కొద్దీ కింది గేర్లకు మార్చి వ్యతిరేక ప్రక్రియలో తగ్గించిన శక్తిని చక్రాలకు పంపుతుంది&period; &lpar;ఒకే RPM వద్ద రెండవ గేరు కంటే మొదటి గేరులో ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది&comma; తక్కువ టార్క్ ఉత్పన్నమవుతుంది&period;&rpar;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక్కడ గేర్లు మార్చటం డ్రైవరు చేసే పని&comma; అందుకు మానవ శక్తి ఖర్చవుతుంది&period; ఆటోమేటిక్ కార్లలో గేర్లు మార్చే పనిని డ్రైవర్ కాకుండా ఒక యంత్రం చేస్తుంది&period; గేర్లు మార్చేందుకు ఆ యంత్రానికీ శక్తి అవసరమే&period; అందుకే ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది&period; వివరాల్లోకి వెళ్తే&comma; ఇంజను RPM పెరిగేకొద్దీ ఆటోమేటిక్ గేర్ బాక్సు తనంతట తానే గేరు మారుస్తుంది&period; RPM తగ్గేకొద్దీ కింది గేరు వేస్తుంది&period; ఈ ప్రక్రియలో గేరు మారే కుదుపు తెలియకుండా డ్యూయల్ క్లచ్ వాడే గేర్ బాక్సులు&comma; ఇంకా ఎక్కువ క్లచ్ ప్లేట్లు ఉన్న అత్యాధునిక&comma; అతిఖరీదైన కార్లూ ఉన్నాయి&period; నేడు ఆటోమేటిక్ సాంకేతికత ఎంతో మెరుగై ఆటోమేటిక్ కార్లు కూడా మాన్యువల్ గేర్ల కార్లతో సమానమైన మైలేజ్ ఇస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79839 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;car-gears&period;jpg" alt&equals;"automatic vs manual car gears which one gives more mileage " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">AMT గేర్‌బాక్స్ మైలేజ్ కంటే TC&comma; CVT గేర్‌బాక్సుల మైలేజ్ ఎక్కువగా ఉంటోంది&period; CVT&comma; TC&comma; DCT&comma; DSG వంటివి నేడు ఆధునిక ఆటోమేటిక్ గేర్ల సాంకేతికతలు&period; ఆధునిక ఆటోమేటిక్ గేర్ బాక్సులు తదుపరి గేరును మరో క్లచ్ ప్లేటులో ముందే వేసి ఉంచి&comma; గేరు మారిన కుదుపు తెలియకుండా చేస్తాయి&period; CVT&comma; DSG లో ఇటువంటి సాంకేతికత వాడబడింది&period; CVT కనిపెట్టింది హోండా అయితే DSG ఫోక్స్ వాగెన్ వారిది&period; మాన్యువల్ కార్లలో మారుతి ఆల్టో లీటరు పెట్రోలుకు 24కిమీలు పరుగెత్తితే&comma; డీజల్ బళ్ళలో హోండా అమేజ్ లీటరుకు 27కిమీలు పరుగెత్తుతోంది&period; &lpar;నా స్నేహితుడి మాన్యువల్ డీజల్ టాటా నెక్సాన్ 29 మైలేజ్ ఇస్తోంది&period;&rpar; అదే ఆటోమేటిక్ పెట్రోల్ కార్లలో రెనో క్విడ్ 24&comma; డీజల్ కార్లలో మారుతి డిజైర్ 28 వరకు మైలేజ్ ఇస్తున్నాయి&period;ఆటోమేటిక్ కార్లు నడపటం తేలిక కావున ఎక్కువగా పట్టణపు ట్రాఫిక్‌లో నడిపేవారు ఇవే ఎంచుకుంటారు&period; వీటి నిర్వాహణ&comma; సర్వీస్ ఖర్చులు మాన్యువల్ కంటే ఎక్కువగానే ఉంటాయి&period; వాడుకను బట్టి ఆటోమేటిక్ లేదా మాన్యువల్ గేర్ల కార్లు కొనుక్కోవటం మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts