సినీ నటులు తమ సిక్స్ ప్యాక్ లేదా 8 ప్యాక్ పొట్టలను చూపుతున్నతర్వాత పురుషులకు తమ బాన పొట్టలను కూడా సిక్స్ ప్యాక్ లేదా 8 ప్యాక్ పొట్టలకు అర్జంట్ గా మార్పు చేసేయాలన్న ఆలోచనలు వస్తున్నాయి. అందుకు గాను జిమ్ లకు వెళ్ళడం అధిక ఖర్చులు పెట్టటం కూడా జరుగుతోంది. కానీ, మీరు జిమ్ లకు వెళ్ళకుండానే ఇంటివద్దే పొట్ట వ్యాయామాలు ఎలా చేయవచ్చో చూడండి. సైకిలింగ్ – మీ పొట్టకు సిక్స్ ప్యాక్ రావాలంటే ఇది మంచి వ్యాయామం. వెల్లకిలా పడుకోండి. చేతులు తలకింద పెట్టండి. ఎడమ మోకాలు వంచి పక్కకు తిరగండి కుడి మోచేయి ఎడమ మోకాలుకు కలపండి. కుడి మోకాలు తిన్నగా వుండాలి. ఇదే మాదిరిగా కుడివేపు భాగానికి చేయండి. ఈ సైకిలింగ్ వ్యాయామం 15 నుండి 20 నిమిషాలు చేయాలి.
ఛైర్ పొజిషన్ – తిన్నగా నిలబడండి. పొట్ట వంగేవరకు మోకాళ్ళు వంచండి. మీ చేతులు ముందుకు చాచండి 1 నుండి 2 నిమిషాలు గాలి బిగబట్టి అలాగే వుండండి, సాధారణ స్ధితికి చేరి గాలి వదలండి. దీనిని పది సార్లు చేయండి. పుల్ అప్స్ – వెల్లకిలా పడుకోండి. చేతులు తలకింద పెట్టండి. శరీర పైభాగాన్ని పైకి లేపండి. మోకాళ్ళు 4 నుండి 5 అంగుళాలు నేలనుండి పైకి లేవాలి. ఈ పొజిషన్ 2 నుండి 3 నిమిషాలుంచండి. కాలి వ్యాయామం – వెల్లకిలా పడుకోండి. మోకాళ్ళను తిన్నగా క్రాస్ చేస్తూ పైకి లేపండి. చేతులు తలవెనుక పెట్టండి. మెడను ముందుకు లాగవద్దు. ఈ పొజిషన్ ఒక్క నిమిషముంచి రిలాక్స్ అవండి. 10 నుండి 15 సార్లు చేయాలి.
చేతుల వ్యాయామం – వెల్లకిలా పడుకోండి. మోకాళ్ళు వంచండి. చేతులు తలవెనుక పెట్టండి. పైకి శరీరాన్ని లాగండి. ఈ పొజిషన్ లో ఒక్క నిమిషం వుండండి. మెడ నొప్పి పెడితే ఒక చేయి మెడకు సపోర్టుగా ఇవ్వండి. దీనిని 8 నుండి 10 సార్లు చేయండి ఈ పొట్ట వ్యాయామాలను పురుషులు రెగ్యులర్ గా ఇంటివద్ద ప్రతిరోజూ చేస్తే, కండలు తిరిగే ఆకర్షణీయమైన శరీరంతో పాటు సిక్స్ ప్యాక్ లేదా 8 ప్యాక్ పొట్ట సొంతమవుతుంది.