Arunachalam : ఆదివారం నాడు అరుణాచలేశ్వర ఆలయంలో ప్రదక్షిణలు చేయడం వలన చక్కటి ఫలితం ఉంటుందని పండితులు అంటున్నారు. ఆదివారం నాడు అరుణాచల ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే ఏం జరుగుతుంది..? అసలు ఎలా ప్రదక్షిణలు చేయాలి.. వంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆదివారం గిరిప్రదక్షిణాన్ని చేస్తే మన కోరికలు తీరుతాయి. ఎంతో పుణ్యం వస్తుంది.
మొదలు పెట్టేటప్పుడు శ్రీ అరుణాచలేశ్వర ఆలయం తూర్పు గోపుర ద్వారంలో ఉన్న లక్ష్మణ వినాయకుడిని నమస్కరించుకుని మొదలుపెట్టాలి. మనం ఉండడానికి కారణం బ్రహ్మ. గిరిప్రదక్షిణ చేయడానికి దయబూనిన వారు సృష్టికర్త బ్రహ్మ. అందుకని ఆయనకి కృతజ్ఞతలు చెప్పి తర్వాత దక్షిణ ద్వారం వద్దకి వెళ్లి అక్కడ ఉన్న బ్రహ్మ లింగాన్ని నమస్కరించుకోవాలి. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు అగర్‌బత్తులని వెలిగించి వాటిని చేత్తో పట్టుకుంటూ ప్రదక్షిణం చేయడం మంచిది.
ఆలయ దక్షిణ గోపురం నుండి మంచి సువాసనతో ఇలా వెళుతూ తిరు అన్నామలైని దర్శించుకోవాలి. దీన్ని సర్ప పడకేశ్వర లింగముఖ దర్శనం అంటారు. తిరుమంజన వీధిలో ఉన్న శ్రీ కర్పక వినాయక ఆలయంలో ఈ అగర్‌బత్తులని ఇచ్చేసి గిరిప్రదక్షిణాన్ని మొదలుపెట్టాలి. గిరి ప్రదక్షిణ మార్గంలోనే ముందుకు నడుస్తూ శ్రీ రమణాశ్రమం దాటి కొంచెం దూరంలో తిరు అన్నామలై స్వామి వారు ఉంటారు.
అలా మీరు ఈ గిరి ప్రదక్షిణాన్ని చేయాలి. గిరిప్రదక్షిణని ఉదయం 6, 7 గంటలకి మొదలు పెట్టవచ్చు. మధ్యాహ్నం ఒంటిగంట లేదా రెండు గంటలకి మొదలుపెట్టచ్చు. రాత్రి 8 నుండి 9కి మొదలుపెట్టొచ్చు. అర్ధరాత్రి మూడు లేదా నాలుగు గంటలకి మొదలు పెట్టొచ్చు. గిరి ప్రదక్షిణం చేయడం వలన చక్కటి ఫలితం ఉంటుంది. భర్త తన వెంట ప్రదక్షిణలు చేయడం లేదని బాధపడే భార్యలు మగ బిడ్డలకి చక్కెర పొంగలిని దానం చేసి గిరిప్రదక్షిణ మొదలుపెడితే వాళ్ల కోరికలని అరుణాచలం తీరుస్తారట.