Birthmark On Forehead : సాధారణంగా మనకు శరీరంపై అనేక చోట్ల పుట్టు మచ్చలు ఉంటాయి. కొన్ని పుట్టుకతోనే వస్తాయి. కొన్ని పెరిగే కొద్దీ ఏర్పడుతుంటాయి. అయితే పుట్టు మచ్చలు శరీరంపై నిర్దిష్టమైన భాగాల్లో ఉంటే వివిధ రకాల ఫలితాలు కలుగుతాయని మచ్చ శాస్త్రం చెబుతోంది. ఇక నుదుటిపై పుట్టు మచ్చ ఉన్నవారికి ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. నుదుటిపై పుట్టు మచ్చ ఉండే వారు ఆలోచనా శక్తిని ఎక్కువగా కలిగి ఉంటారట. వీరు ప్రతి విషయాన్ని ఆలోచించి మరీ చేస్తారట. దూర దృష్టి వీరికి ఎక్కువగా ఉంటుందట.
నుదుటిపై పుట్టు మచ్చ ఉండే వారు తమ శక్తి సామర్థ్యాలతో ఎదుగుతారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు. వీరికి సొంతంగానే కాక వారసత్వంగా కూడా ఆస్తి కలసి వస్తుంది. ధనం మిక్కిలిగా సంపాదిస్తారు. డబ్బుకు లోటు ఉండదు. అలాగే చదువుల్లోనూ ప్రతిభావంతులు అయి ఉంటారు. అయితే నుదుటి భాగం పెద్దగా ఉండి దానిపై పుట్టు మచ్చ ఉంటేనే పైన చెప్పిన ఫలితాలు వస్తాయి. అలా కాకుండా నుదుటి భాగం చిన్నగా ఉండి పుట్టు మచ్చ ఉంటే వీరికి పైన చెప్పిన దానికి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. వీరికి సమాజంలో గౌరవం ఉండదు. వీరు కష్టపడలేకపోతుంటారు. డబ్బు ఉండదు. సమస్యలన్నీ చుట్టు ముడతాయి.
అయితే నుదుటి భాగం ఎలా ఉన్నా సరే దానిపై నలుపు రంగు కాకుండా ఎరుపు రంగు మచ్చ ఉంటే మంచిదట. దీంతో నుదుటి భాగం సైజుతో సంబంధం లేకుండా అన్నీ మంచి ఫలితాలే కలుగుతాయట. వీరు మిక్కిలిగా ధనం సంపాదిస్తారట. అలాగే ఏదో ఒక విధంగా ఆకస్మికంగా ధన లాభం కలుగుతుందట. వీరు చాలా తక్కువ కాలంలోనే అభివృద్ధిలోకి వస్తారట. ఇక నుదుటిపై తేనె రంగు మచ్చ ఉండడం అంత మంచిది కాదని అంటున్నారు. అలా ఉంటే అన్నీ కష్టాలే అనుభవిస్తారని పండితులు చెబుతున్నారు.