చనిపోయే ముందు కొన్ని అసాధారణ లక్షణాలు ఆ వ్యక్తిలో పక్క నున్న వారు గమనించగలరు. భోజనం కానీ మరేదైనా ఇష్టమైన పదార్థాలు తినాలనే ఆతృత కనిపిస్తుంది. యూరినేషన్ లేదా మోషన్ అయ్యే అవకాశం ఉంది. అతిగా కుటుంబ సభ్యులతో మాట్లాడడం ( ఓపిక ఉన్న వారు మాత్రమే) కనిపిస్తుంది.
వారికి అత్యంత ఇష్టమైన వ్యక్తిని చూడాలని గానీ మాట్లాడాలని గానీ అనుకుంటారు. ఇవన్నీ ఇంట్లో వారు గమనించగలిగే సంకేతాలు. అసలు వ్యక్తికి ప్రాణం పోతుంది అనే సంకేతాలు ఏమీ ముందుగా కనపడవు.
సడెన్ గా కరెంట్ పోతే దీపం ఆరిపోయినట్టు , ప్రాణం, ఊపిరి ఆగిపోతుంది. కొంతమందికి ఎక్కిళ్ళు వస్తున్నట్టు, మరికొందరికి ఊపిరి అందకుండా ఆయాస పడుతున్నట్లు బయటకు కనిపిస్తుంది. చాలామంది. గాఢ నిద్రలో ఊపిరి వదిలేస్తారు. ఆశ్చర్యం ఏమిటంటే తొంభై శాతం మందికి నాకు మృత్యువు సమీపంలోనే ఉంది అన్న భావన అసలు కలుగదు. అదే మాయ.