ఆధ్యాత్మికం

వివాహం త్వ‌ర‌గా జ‌ర‌గాలంటే.. ఇలా చేయండి..!

పిల్లల వివాహం ఆలస్యం అనేది తల్లి తండ్రులకు భరించలేని బాధను కలిగిస్తుంది. సరైన ఈడులో పెళ్లి చేసేయాలని బావిస్తారు. అయితే చాలా మందికి సరైన సమయంలో పెళ్లిళ్లు అవుతాయి. ఇక కొందరికి కొంచెం అటు ఇటుగా పెళ్లి జరుగుతుంది. కానీ కొందరికి మాత్రం వివాహం జరుగుతుంది అనే సూచనలు కూడా కనిపించవు. అందుకు అనేక కారణాలు ఉంటాయి. కొందరికి అసలు ఏ సమస్యా లేకున్నా వివాహం కాదు. త్వరగా వివాహం కావాలంటే ఏం చేయాలి?

వివాహం కావడం లేదని బాధపడేవారు ఆంజనేయ స్వామిని పూజించాలి. ప్రతి మంగళవారం 108 తమలపాకులతో ఆయనకు పూజ చేయాలి. ఇలా 8 మంగళవారాల పాటు చేయాలి. దీంతో ఆయన అనుగ్రహం లభిస్తుంది. త్వరగా వివాహం అవుతుంది.

do like this on tuesday to get married soon

శని దోషం కారణంగా వివాహం ఆలస్యం అవుతుంది అనుకున్న వారు అందుకు ఇలా చేయాలి. వారు తమలపాకుల్లో తేనె పోసి అనంతరం వాటిని చీమలకు ఆహారంగా పెట్టాలి. దేవీంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభాషిణి సర్వసౌభాగ్య కార్యేషు సర్వ సౌభాగ్య దాయినీ..

పైన ఇచ్చిన మంత్రాన్ని ప్రతి రోజు 108 సార్లు పారాయణం చేయాలి. ఇలా చేస్తే దోష నివారణ అవుతుంది. ఫలితంగా వివాహం త్వరగా అవుతుంది. వివాహానికి ఉండే అడ్డంకులు తొలగిపోయి త్వరగా వివాహం జరుగుతుంది.

Admin

Recent Posts